నీతా అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ భార్య.. అంతేనా..ఆమెకు ఇంకో హోదా కూడా ఉంది. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ కూడా.. ఆమెకు ఓ అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్ లోని అతిపెద్ద మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ బోర్డులో గౌరవ ధర్మకర్తగా ఎంపికైంది.


ఇలాంటి గౌరవం అందుకున్న తొలి ఇండియన్ ఈమే. ఈ మేరకు మ్యూజియం ఛైర్మన్ డేనియల్ బ్రాడ్ స్కీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంతకీ ఈమెను ఎందుకు ఎంపిక చేశారు..? కళలు, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నందుకు ఆమెకు ఈ గౌరవం దక్కిందట.


నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ మూడేళ్ల నుంచి ఈ మెట్రోపాలిటన్ ఆర్ట్ మ్యూజియంకు సహాయం చేస్తోందట. ఈ మ్యూజియం అంతర్జాతీయ మండలిలో నీతా అంబానీ మెంబర్ గా ఉన్నారట. అందుకే ఆమెను ఈ విధంగా గుర్తించి ఎంపిక చేశారు. మొత్తానికి ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ అయ్యారామె.


మరింత సమాచారం తెలుసుకోండి: