తల్లి కాబోతున్న మహిళల్లో ఉండే ఆలోచన ఒకటే కడుపులో పెరిగే బిడ్డ గురించి. పుట్టేది ఆడపిల్ల లేదా మగపిల్లవాడా అని.. అయితే మహాలక్షి లాంటి ఆడపిల్ల ఇంటికి వస్తుందంటే ఎవరు ఆనందించరు చెప్పండి. ఆడపిల్ల పుట్టే గర్భిణీ స్త్రీ లలో ఉండే కొన్ని లక్షణాలు ఏంటో చూద్దాం.. కాని ఇవి అందరిలోనూ ఒకేలా ఉంటాయని నమ్మకం లేదు. పురాతన కాలంగా మన పెద్దవాళ్ళు చెప్పే సంగతులు ఇవి.. గర్భిణీ స్త్రీ యొక్క అల్ట్రాసౌండ్ స్కానింగ్ సమయంలో డాక్టర్ మీకడుపున శిశువు యొక్క హృదయ స్పందన పరిశీలించినప్పుడు, హృదయ స్పందనలు ఒక నిముషానికి 140 సార్లు కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీరు ఒక అందమైన ఆడ శిశువుకు జన్మనిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.మీ చర్మంపై బొబ్బలు మరియు దద్దుర్లు కనిపిస్తే, మీరు ఒక ఆడ శిశువుని పొందబోతున్నారని ఉహించవచ్చు. మన పెద్దవాళ్ళు కూడా ఆడ శిశువు తల్లి నుండి అన్ని అందాలను దొంగిలిస్తుందని చెప్తారు.అవును, మీరు సరిగానే చదివారు. 

 

 


గర్భధారణ సమయంలో ఆడ శిశువుని కలిగిన తల్లికి మానసిక చలనం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రోజువారీగా హార్మోన్ల మార్పుల కారణంగా స్త్రీకి ఎల్లప్పుడూ మానసిక కల్లోలం ఉంటుంది.మీరు కుడి వైపుకు తిరిగి నిద్రపోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నట్లయితే  మీ కడుపులో ఉన్నది ఆడ శిశువుగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఆడ శిశువు కడుపులో ఎడమ వైపుకు ఉంటుంది.గర్భంలో ఉన్న ఆడ శిశువు తన తల్లి యొక్క  జుట్టు కూడా సన్నగా మరియు నిస్తేజంగా మారుతుంది. 

 

 


ఇది కూడా ఆడశిశువు కడుపులో పెరుగుతున్న ఒక సూచన.మీ రొమ్ముల పరిమాణంలో ఆకస్మిక మరియు అధిక మార్పును చూసినప్పుడు, మీరు ఒక ఆడ శిశువును  ఉహించవచ్చు. పూర్తి గర్భధారణ సమయంలో కాబోయే తల్లి మరింత సుకుమారంగా, మనోహరంగా ఉన్నట్లయితే, ఈ ప్రపంచంలోకి ఒక ఆడ శిశువు ప్రవేశిస్తుందని ఒక సంకేతంగా చెప్పవచ్చు.మూత్రపు రంగు నిస్తేజమైన పసుపురంగులో ఉంటే, మీ కడుపులో ఒక అందమైన ఆడ శిశువు ఉంది అని చెప్పే సంకేతాలలో ఒకటిగా దీనిని చేర్చవచ్చు.

 


అయితే, పైన పేర్కొన్న లక్షణాలు అన్నీ కేవలం పెద్దల నమ్మకాలు. అయినప్పటికీ కూడా ఇవి చాలా మంది మహిళలకు బాగా పనిచేసింది. అదే సమయంలో, ఇవి కొంత మందికి  పని చేయలేదు అని కూడా చెప్పవచ్చు. వీటిలో అధిక మార్పులు గర్భదారణ సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా ప్రతీ మహిళ విషయంలోనూ చోటుచేసుకుంటాయి. ఇది ఆయా మహిళల శరీర స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ కొత్త కుటుంబ సభ్యుని ఆశ్చర్యకరమైన రాకను ఆనందించండి.మహిళలు దయచేసి మీ జీవితంలోకి కొత్త అనుభూతులను ఆహ్వానించడానికి, మీరు చేయగలిగే అన్నిటినీ చేసి ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: