అమ్మ అని పిలిపించుకోవడానికి ప్రతి తల్లి ఎదురుచూస్తుంది. అలాగే ఆ బిడ్డను చూసి ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో సంబరపడిపోతారు. వచ్చే బుజ్జాయి కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు.అయితే ఒక్కోసారి ఇద్దరు బిడ్డలను  కూడా కడుపులో మోయవలిసి వస్తుంది. ఇద్దరు పిల్లలు ఒకేసారి పుట్టడాన్ని కవల పిల్లలు అంటారు. ఇలా అందరికి కవల పిల్లలు పుట్టరు. ఇది అరుదుగానే జరుగుతుంది. అయితే, కొంతమందికి కవల పిల్లలు కావాలని అనుకుంటారు. అయితే, కవల పిల్లలు పుట్టడానికి కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి. అవేంటో తెలుసుకోండి..



సాధారణంగా.. ప్రెగ్నెన్సీ అనేది ఆ మహిళ  బీఎంఐకి సంబంధం ఎక్కువగా ఉంటుంది. బీఎంఐ 30 కన్నా ఎక్కువగా ఉంటే మహిళలకు కవల పిల్లలు పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట. అదే విధంగా, చాలా రోజుల వరకూ పిల్లలు పుట్టకుండా అనేక రకాల ట్రీట్‌మెంట్స్ తీసుకున్నవారు. వాటిని ఒకేసారి ఆపేసి పిల్లల కోసం ప్లాన్ చేస్తే అండాలు రెండు, అంతకంటే ఎక్కువ విడుదల అవుతాయి. అలాంటి వారికి కూడా కవల పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుదట. ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ఉత్పత్తి అయ్యే మహిళల్లో మల్టి విటమిన్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వేసుకునే వారికి కూడా కవల పిల్లలు పుట్టే అవకాశం కలదు ..దీంతో పాటు.. 35 సంవత్సరాలు వయసు దాటిన వారిలో విడుదలయ్యే అండాల నాణ్యత ఎక్కువగా ఉండి.. వారికి రెండు అండాలు ఒకేసారి విడుదలయితే కవలలు పుట్టే  అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.




డెయిరీ ఉత్పత్తులను ఎక్కువగా తీసుకునే మహిళలకు కూడా అంటే పాలు, వెన్న, చీజ్ ఎక్కువగా తీసుకునే వారికి కూడా కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.కొన్ని సహజ పదార్థాల ద్వారా కవల పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పుట్టే కవల పిల్లలు ఇద్దరు మగ పిల్లలు అయి ఉండవచ్చు లేదంటే ఇద్దరు ఆడపిల్లలు అయి కూడా ఉండవచ్చు. ఒక్కోసారి ఒక ఆడ శిశువు, ఒక మగ శిశువు కూడా జన్మించవచ్చు..అయితే కడుపులో ఇద్దరు బిడ్డలను మోస్తున్న గర్భిణీ స్త్రీ మాత్రం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తినే తిండి విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: