ఓ కానిస్టేబుల్ తన భార్యను వదిలివేయడంతో ఆమె అమరణదీక్షకు దిగింది. భర్త తనను విడిచివెళ్లిన చోటనే తన చిన్నారి కొడుకుతో కలిసి అమరణ దీక్షకు కుర్చుంది.కట్టుకున్న భార్యను, కన్నపిల్లల్ని.. పొలంలో  వదిలి  పారిపోయాడో జవాను. జనాల్ని కాపాడాల్సిన కానిస్టేబుల్...కనీసం భార్య, బిడ్డల్ని కూడా రక్షించడం మాని అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడు. వినలేదని ఈ నిర్వాకానికి తెగబడ్డాడు.


వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌కు చెందిన సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఓంకార్‌తో 2013లో  దీపకు వివాహం అయింది.వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. వివాహ సమయంలో దీప తల్లిదండ్రులు 11 గ్రాముల బంగారం, 2.5 లక్షల నగదు, మూడు గుంటల స్థలం కట్నంగా ఇచ్చారు. అయితే ఓంకార్ మాత్రం దానితో తృప్తి పడకుండా అదనపు కట్నం కోసం దీపను వేధించసాగాడు. ఈ క్రమంలోనే పలుమార్లు ఆమెపై భౌతిక దాడులకు పాల్పడ్డాడు. కొడుకు పుట్టాక ఇది మరింతగా పెరిగింది.కట్నంగా ఇచ్చిన భూమి తన పేరున రాసివ్వలేదని.. మరికొన్నాళ్లు అనుమానంతోనూ వేధించేవాడు. ఒకసారి ఈ వేధింపులపై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం దీప రెండు నెలల గర్భిణి.ఐన కూడా తాను మారకుండా అలాగే వేధించాడు దీపని.

ఈ క్రమంలో ఈ నెల 3న ఓంకార్‌ తాగొచ్చి కత్తితో బెదిరించాడు. సర్దిచెప్పడానికి వచ్చిన ఆమె తండ్రి, సోదరుడిపై చెప్పుతో దాడిచేశాడు.భార్యాభర్తల మధ్య గొడవలు రచ్చకెక్కాయి. దీంతో వీటిని పరిష్కరించడానికి గ్రామ పెద్దలు కూడా ప్రయత్నించారు. అయితే ఇది నచ్చని ఓంకార్.. ఆదివారం భార్య, కుమారుడిని తీసుకెళ్లి కమలాపూర్‌లోని పొలంలో విడిచిపెట్టి వచ్చాడు. దీంతో దీప అక్కడే కుమారుడితో కలిసి దీక్ష దిగింది.ఈ విషయాన్ని గుర్తించిన కొందరు రైతులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దీపతో మాట్లాడారు. అనంతరం ఓంకార్, దీపలను పోలీసులు కౌన్సిలింగ్ నిమిత్తం కమలాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: