ఆరోగ్యంగా, హాయిగా జీవించాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. విశాలంగా ఉండాలి. కాసింత ధ్యానానికీ, వ్యాయామానికి చోటు ఉండాలి. చాలా మంది ఇల్లు అంటే రెండు పడక గదులు, ఒక హాల్, ఓ కిచెన్ అనుకుంటారు. యోగా చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా చోటు ఉండాలన్నా, ఆలోచన రాదు. అపార్ట్ మెంట్ జీవితాలకు అలవాటుపడినవారు. దేహానికి వ్యాయామం అవసరమని గుర్తించరు. కొందరు ఇందుకు మినహాయింపు కానీ ఇంట్లో ఇందుకోసం చోటు ఉండాలి. ఉదయమ వాకింగ్ కు వెళ్లి వచ్చినా కాస్పేపు ఇంట్లొ వ్యాయామం చేయడం మంచిది. అందుకని ఇంట్లో కాసింత స్థలం తీసుకుని ఇల్లు, సమయం ఉంచుకోవాలి. ప్లాట్ కాకుండా సొంతంగా స్థలం తీసుకుని ఇల్లు కట్టుకునేవారు వ్యాయామం కోసం ఒక గది నిర్మించుకొవాలి. కొందరు డాబాలపైన వ్యాయామం చేస్తుంటారు. ఇది పదుగురి ముందు ప్రదర్శనలా ఉంటుంది. కొన్ని రకాల వ్యాయామానికి ఆరుబయట ప్రదేశం బావుంటుంది. కానీ అన్ని రకాల వ్యాయమాలకు కుదరదు, కనుక డాబా పైన గది వుంటే ఇందుకోసం కేటాయించుకోవాలి. డాబాపైన గానీ, ఇంటి లోపలగానీ, ప్రత్యేకంగా ఇందుకోసం ఒక గది ఉండాలి.  ఉదయం పూట ధ్యానం చేయడానికి గానీ యోగా చేయడానికి గానీ ఇలాంటి గది ఉండటం ఉపయుక్తం, అలాగే కొన్నిరకాల వ్యాయామ సాధనాలు కూడా ఇందులో ఉంచుకోవచ్చు. అందుకని వ్యాయామం కోసం కొంత చోటు ఉండాలి. ఇలా ప్రత్యేకంగా గది లేనివారు ఉన్న గదుల్లోనే ఒక దానిని కొంత విశాలంగా, ఖాళీగా ఉంచుకోవాలి. నానారకాల సామాన్లతో నింపేస్తే వ్యాయామం చేయడం కుదరదు. కనుక ఈ గదిలో ఎక్కువ వస్తువులు ఉంచకూడదు. వ్యాయామం చేసే వేళలో ఆ గదిలోకి ఇంట్లోవారు రాకుండా చూసుకోవాలి. లేదా తలుపులు మూసేయాలి. పిల్లలకు చిన్నప్పట్నించే వ్యాయామం చేసే అలవాటు చేయాలి. రోజుకు కనీసం అరగంటయినా ఇంట్లో చిన్న చిన్న వ్యాయామాలు చేయించాలి. వ్యాయామానికి అవసరమైన సాగాగ్రీని ఇంట్లో ఒకే చోట ఉంచాలి. కొందరు వీటిని బెడ్రూంలలోనో, హాల్లోనో ఉంచుతారు. ఇల్లు విశాలంగా లేనప్పడు ఇలా చేయకతప్పదు. కానీ ఇల్లు కట్టుకునేటప్పడే వ్యాయామం కోసం ఓ గది ప్రత్యేకించి ఉండేలా ప్తాన్ రూపొందించుకోవాలి. ధ్యానం, యోగ, చేసే సమయాన అంతరాయం ఉండకూడు, పెద్దపెద్ద చప్పుళ్లు చేయకూడదు. ఈ సమయాన అంతరాయం ఉండకూడదు. ఈ సమయాన వంటగదిలో కుక్కర్, మిక్సీ సౌండ్స్ రాకుడా ఉంటే మంచిది. అలాగే టీవీ చప్పుడు కూడా ఉండకూడదు వ్యాయామం చేసే వేళ అంతా ప్రశాంతంగా ఉండాలి. ఇందుకు అనువుగా ఇంట్లో వారికి అవసరమైన సూచనలు ఇవ్వాలి. ఇంట్లో వ్యాయామ సామాగ్రీ ఎక్కవ చోటు లేదనుకుంటే ఉన్నంతలోనే వీలయిన రీతిలో వ్యాయామం చేయడానికి ప్రయత్నించాలి. అందుకని ఉదయం వేళ కాసింత మౌనానికి, ధ్యానానికి, వ్యాయామానికి చోటు ఇవ్వాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: