నిస్సాన్ కంపెనీ ఈ డిసెంబర్ నెలలో తన కార్ 'మాగ్నైట్' మీద సూపర్ ఆఫర్ ఇస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఈ నెలకు మాత్రమే ఉంటుంది.కాబట్టి ఈ నెలలో 'నిస్సాన్ మాగ్నైట్' కొనే వారు ఈ ఆఫర్ ని వినియోగించుకోండి.  మరిన్ని వివరాలలోకి వెళితే...నిస్సాన్ మాగ్నైట్ కార్ మీద కంపెనీ ఇప్పుడు రూ. 15,000 దాకా ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10,000 దాకా కార్పొరేట్ డిస్కౌంట్ ఇంకా అలాగే రూ. 10,000 దాకా ఫ్రీ యాక్ససరీస్ లేదా క్యాష్ డిస్కౌంట్ ని అందిస్తుంది. నిజానికి నిస్సాన్ మాగ్నైట్ కార్ గత రెండేళ్ల నుంచి కంపెనీకి మంచి అమ్మకాలు తీసుకురావడంలో బాగా సహాయపడుతుంది.నిస్సాన్ మాగ్నైట్ SUV కార్ ని ఈ నెలలో కొనాలనుకునేవారు వారు రూ. 35,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ SUV కార్ ఇండియన్ మార్కెట్లో తయారైనా కానీ మన దేశం నుంచి ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, బ్రూనై, ఉగాండా, కెన్యా, సీషెల్స్, మొజాంబిక్ ఇంకా అలాగే జాంబియా వంటి ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతుంది.


దీన్ని బట్టి చూస్తే నిస్సాన్ మాగ్నైట్ కి ప్రపంచ మార్కెట్లో కూడా మంచి డిమాండ్  ఉందని స్పష్టంగా తెలుస్తోంది.అలాగే ఈ కార్ క్రాష్ టెస్ట్ లో కూడా మంచి సేఫ్టీ రేటింగ్ పొందింది.అందువల్ల దీనికి డిమాండ్ మరింత ఎక్కువయింది. నిస్సాన్ మాగ్నైట్ ఇప్పటికే ఇండియాలో  చాలా హై-ప్రొఫైల్ ఆటోమోటివ్ అవార్డులను గెలుచుకుంది. ఇంకా ఇటీవల 'ది రేస్ మంకీ కార్ ఆఫ్ ది ఇయర్ 2021'గా సెలెక్ట్ అయ్యింది. ఇవన్నీ ఈ SUV కార్ పై ప్రజల నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసాయనే చెప్పాలి.ఈ కారులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో ఉంటుంది.టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ ఇంకా సివిటి గేర్‌బాక్స్ అందించబడ్డాయి. 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మాక్సిమం 98.63 బిహెచ్‌పి ఇంకా 152 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కారులో మంచి ఇంధన సామర్థ్యం కోసం ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టంని వాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: