ఈ రోజుల్లో మనకి స్మార్ట్ ఫోన్ లాగానే బైక్ కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. బైక్ అనేది మనకు నిత్యావసరంగా మారిపోయింది. కానీ పెట్రోల్ రెట్లు పెరిగిన కారణంగా మధ్య తరగతి ప్రజలు బైక్స్ కొనడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇక ఇండియన్ మార్కెట్‌లో ప్రస్తుతం చాలా రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త కొత్త స్టార్టప్స్ కూడా అదిరిపోయే డిజైన్‌తో కొత్త ఇ-స్కూటర్లను ఇండియన్ మార్కెట్‌లోకి గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నాయి.కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావించే వారికి ఇది చాలా మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. మీకు నచ్చిన మోడల్‌ను కొనొచ్చు. మీకు అందుబాటు ధరలోనే అదిరే స్కూటర్లు లభిస్తున్నాయి. వాటిలో ఒకటి డెటెల్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ (EV) ఈజీ ప్లస్. ఇక దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది చూడటానికి సూపర్ గా ఇంకా కొత్త డిజైన్‌తో ఉంది. దీని రేటు కూడా తక్కువగానే ఉంది. కంపెనీ దీన్ని కేవలం రూ. 46,999కు మాత్రమే విక్రయిస్తోంది. మీరు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ బైక్ ని కొనుగోలు చేయొచ్చు.


ప్రస్తుతం ఈ మోడల్‌కు సిల్వర్ ఇంకా రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో ఇందులో చాలా మంచి సూపర్ ఫీచర్లు ఉన్నాయి. ట్యూబ్‌లెస్ టైర్లు, కంఫర్ట్ సీటు, డిజిటల్ మీటర్, అలాయ్ వీల్స్, లిథియం అయాన్ బ్యాటరీ ఇంకా 20 ఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.దీనికి ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా 60 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ తెలియజేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా కేవలం రూ. 7 నుంచి రూ. 10 ఖర్చుతో మనం ఏకంగా 100 కిలోమీటర్లు వెళ్లొచ్చని కంపెనీ పేర్కొంటోంది. అయితే దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. అంటే మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. అలాగే లైసెన్స్ కూడా ఉండాల్సిన పని లేదు.అందువల్ల తక్కువ ధరలోనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని మీరు భావిస్తే.. దీన్ని కొనుగోలు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: