లక్సరియస్ కార్ల విభాగంలో అత్యంత ప్రజాధరణ పొందిన ఆడి తమ కార్ల రేట్లను పెంచింది. అధునాతన సౌకర్యాలతో కస్టమర్స్ కోరుకునేలా తమ కార్లను డిజైన్ చేస్తున్నారు. ఆడి A3 సెడన్ కార్ల ప్రైజ్ పెంచడం జరిగింది. పాత ధర మీద దాదాపుగా 4 లక్షల నుండి 5 లక్షల దాకా ప్రైజ్ హైక్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆడి A3 సెడన్ నుండి 4 వేరియెంట్ అందుబాటులో ఉన్నాయి.    


అందులో A3 35 TFSI ప్రీమియం ప్లస్, 35 TFSI టెక్నాలజీ. 35 TDI ప్రీమియం ప్లస్, 35 TDI టెక్నాలజీ. ఆడి A3 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో తో 150 bhp, 20 nm టార్క్ తో అందుబాటులో ఉంది. 7 స్పీడ్ గేర్ బాక్స్ సౌకర్యంతో ఈ వెహికల్స్ వస్తున్నాయి. 


ఇక ధర విషయానికొస్తే TFSI ప్రీమియం ప్లస్ 33.12 లక్షలు ఉండగా.. అది కాస్త 36 లక్షలుగా నిర్ణయించారు. ఆడి డీజిల్ కార్ల విషయానికొస్తే 2 లీటర్ టర్బో చార్జెడ్ డీజిల్ ఇంజిన్ తో 143 భ్ప్, 320 nm టార్క్ తో 6 స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ తో వస్తున్నాయి.    



మరింత సమాచారం తెలుసుకోండి: