
ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా ఎప్పుడు ఏదో ఒకటి అతనికి నచ్చింది ట్విట్ చేసి ట్రెండ్ అయ్యేలా చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మరో సంచలన ట్విట్ చేశారు.. మరి కొందరి మనసులు దోచుకున్నారు.. ఆనంద్ మహింద్ర. అసలు అంతగా ట్విట్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అంత చిగురుటాకులా వణుకుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ పై అయన ట్విట్ చేశాడు.. ఇప్పటికే అయన తన మహీంద్రా కంపెనీ కూడా వాహన తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు.. అంతేకాదు అంతేకాకుండా మహీంద్రా హాలిడేస్ సంస్థ తన రిసార్ట్స్‌ను మెడికల్ కేర్ సెంటర్లుగా ఉపయోగించుకునేందుకు అందుబాటులో ఉంచనుందని అయన పేర్కొన్నారు.
కరోనా ఎఫెక్ట్ పడి నష్టాల్లో కూరుకుపోయిన చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారిని ఆదుకునేందుకు ప్రత్యేకంగా మహీంద్రా ఫౌండేషన్ ద్వారా ఒక ఫండ్ ఏర్పాటు చేసి, సాయం అందిస్తామని ఆయన తెలిపారు. అంతేకాదు ఈ ఫండ్ కు ఆనంద్ మహీంద్రా అతని శాలరీని విరాళంగా అందించనున్నారు. ఏమైతేనేం ట్విట్టర్ వేదికగా అతని మంచి మనసును ప్రపంచానికి తెలియచేసాడు.
—Our Projects team stands ready to assist the Govt/Army in erecting temporary care facilities. —The mahindra Foundation will create a fund to assist the hardest hit in our value chain (small businesses & the self employed) (4/5)
— anand mahindra (@anandmahindra) March 22, 2020