ప్రముఖ బ్రిటీష్ కార్ల తయారీ సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ప్లాస్టిక్ ఒక భాగమైంది. ఈ సింథటిక్ పాలిమర్ తో ఎన్నో రకాల కాలుష్య సమస్యలకు దారి తీస్తున్నాయి. శిలాజ ఇంధనాలు, కార్బన్ మూలకాలు, సహజవనరులను ఉపయోగించి వివిధ పాలిమర్లను తయారు చేస్తారు. ఇది తేలికగా ఉండటంతో పాటు నచ్చిన ఆకారంలో మలుచుకునే సౌకర్యం కలిగి ఉంది. దీంతో ప్లాస్టిల్ వాడకం లేని ప్రపంచాన్ని మనం ఊహించలేం.. ప్లాస్టిక్ వినియోగం అంతలా పెరిగింది. అయితే ఈ ప్లాస్టిక్ ద్వారా పర్యావరణ సమస్య తలెత్తుతోంది. వెయ్యి ఏళ్లు దాటినా ప్లాటిక్ తన స్వరూపాన్ని కోల్పోదు. దీన్ని తగలబెట్టినప్పుడు పర్యావరణంలో కాలుష్యం చేరి సమస్యలు తలెత్తుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడానికి ముందుకు వచ్చాయి. ఇప్పటికే కొన్ని దేశాలు ప్లాస్టిక్ ను నిషేధించాయి. కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్టిక్ ను నిషేధించాయి. అయితే తాజా ప్రముఖ బ్రిటిష్ కార్ల తయారీ సంస్థలు ప్లాస్టిక్ కార్లను తయారు చేయోద్దని నిర్ణయించుకున్నాయి. వాటి స్థానంలో బయో డిగ్రేడబుల్ పదార్థాలను ఉపయోగించి కార్లను తయారు చేయనున్నాయి.

కార్ల తయారీలో ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన బయో డిగ్రేడబుల్ పదార్థాలను వాడుతామని బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ జాగ్వార్, ల్యాండ్ రోవర్ ప్రకటించుకున్నాయి. భవిష్యత్ లో మార్కెట్ లో రిలీజ్ అయ్యే కార్లన్ని డిగ్రేడబుల్ పదార్థాలు, సస్టెయినబుల్ లేదర్ ను వాడుతామని తెలిపాయి. సముద్రాల్లో, భూమి మీద పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి మంచి నాణ్యత ఉండే ఇంటీరియల్ ను తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. దీనికోసం జాగ్వార్, ల్యాండ్ రోవర్ సంస్థలు ఎకోనైల్ నైలాన్ ను ఉపయోగించనున్నారు. ప్రముఖ పరిశ్రమ సింథటిక్ ఫైబర్స్ కంపెనీ ఆక్వాఫిల్ సంస్థ ఎకోనైల్ నైలాన్ని తయారు చేయనుంది. దీంతో రీసైకిల్ ద్వారా ప్లాస్టిక్ నుంచి సస్టెయినబుల్ లెదర్ ను వేరు చేయనున్నారు. ప్లాస్టిక్ ను నిరోధించేందుకు తమ వంతు కృషి చేస్తున్న జాగ్వార్, ల్యాండ్ రోవర్ కంపెనీలు పేర్కొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: