బెంగళూరు సిటీకి చెందిన షేర్డ్ స్కూటర్ మొబిలిటీ కంపెనీ బౌన్స్ (Bounce), గత సంవత్సరం డిసెంబర్ నెలలో భారత మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ "బౌన్స్ ఇన్ఫినిటీ ఇ1" (Bounce Infinity E1) ఎలక్ట్రిక్ స్కూటర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసినదే. కాగా, వినియోగదారులు ఇప్పుడు ఈ బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్ల కోసం ఎక్కువ కాలం వెయిట్ చేయవలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ కంపెనీ రాజస్థాన్‌లోని భివాడిలో ఉన్న తమ అత్యాధునిక తయారీ కేంద్రంలో ఇన్ఫినిటీ ఇ1 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ ని ప్రారంభించింది. ఇంకా ఇవి ప్లాంట్ నుండి డీలర్లకు విడుదల కావడం కూడా ప్రారంభమైంది.పూర్తిగా ఇండియాలో తయారు చేయబడిన ఈ మేడ్ ఇన్ ఇండియా బౌన్స్ ఇన్ఫినిటీ ఇ1 ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ఏప్రిల్ 18, 2022 వ తేదీ నుండి దేశవ్యాప్తంగా స్టార్ట్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం వచ్చేసి 2 లక్షల స్కూటర్లు.



ప్రస్తుతం, ఏటా రెండు లక్షల యూనిట్లను తయారు చేస్తున్న ఈ ప్లాంట్ ఇండియన్ ఈవీ మార్కెట్లో వేగంగా పెరుగుతున్న డిమాండ్ ను సమర్థవంతంగా తీర్చగలదని భావిస్తున్నారు. ఇది కాకుండా, ఈ సంవత్సరం చివర్లో, దక్షిణ భారతదేశంలో ఏటా 5 లక్షలకు పైగా స్కూటర్లను ఉత్పత్తి చేయగల మరో యూనిట్‌ను కూడా రెడీ చేయాలని బౌన్స్ యోచిస్తోంది.ఇక ఈ సందర్భంగా బౌన్స్ ఇన్ఫినిటీ సహ వ్యవస్థాపకుడు ఇంకా అలాగే సీఈఓ వివేకానంద హలేక్రే మాట్లాడుతూ, 'తమ ప్లాంట్ నుండి బౌన్స్ ఇన్ఫినిటీ ఇ1 ఎలక్ట్రిక్ స్కూటర్లను రిలీజ్ చేయడం పట్ల తాము సంతోషంగా ఉన్నామని ఫస్ట్ బ్యాచ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు త్వరలోనే రిలీజ్ కానున్నాయని చెప్పారు. దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కస్టమర్‌లకు డెలివరీ చేయబడుతుందని, ఇండియాలో మారుతున్న మొబిలిటీ భవిష్యత్తు గురించి తాము సంతోషిస్తున్నాము ఇంకా దానిలో భాగమైనందుకు గర్విస్తున్నామని' ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: