మనిషి ఎంత అందంగా ఉన్నా ఆ అందాన్ని చూడాలంటే కళ్లు ఉండాలి. అయితే కళ్ల అందం కోసం మనం ఎన్నో జాగ్రత్తలు పడుతుంటాం. ముఖ్యంగా ఆడవారి కళ్లపై ఎంతో మంది కవులు అద్భుతంగా వర్ణించారు.  కలువు కళ్లు, చారడేసి కళ్లు ఇలా ఎన్నో రకాలుగా అభివర్ణించారు. ఇక అందమైన కళ్ల కోసం కొన్ని చిట్కాలు గురించి తెలుసుకుందాం. 


ఒక ఛైర్ పై అనుకూలంగా కూర్చోండి. మీ రెండు చేతులు వేడిఅయ్యెంత వరకు ఒక దానితో ఒకటి రుద్దండి. మీ కళ్ళు మూసుకుని వెచ్చటి మీ చేతులతో కనుగుడ్ల మీద బరువు పడకుండా కప్పండి. మీ ముక్కు కప్పబడకూడదు. మీ చేతి వేళ్ళ సందులోంచి వెలుతురు రాకుండా జాగ్రత్తపడండి. 

  మీయెక్క చేతుల పక్క నుండి లేదా ముక్కు పై భాగం నుండి వెలుతురు చేరకుండా జాగ్రత్త పడండి. కొన్ని రంగులు మీకు కనిపిస్తుంటాయి. కానీ దట్టమైన నలుపు రంగుని ఉహించుకుని దాని మీదే దృష్టి కేటాయించండి. చిన్నగా శ్వాస తీసుకుంటూ ఏదైనా ఆనందకరమైన సందర్భాన్ని గుర్తుకుతెచ్చుకోండి. లేకా ఏదైనా మీ పాత మదుర సన్నివేశాన్ని ఉహించుకోండి. చీకటి తప్ప ఏమీ కనిపించనప్పుడు మీ చేతులని కళ్లపై నుండి తీసివెయ్యండి. ఈ పద్దతిని మూడు లేక అంత కంటే ఎక్కువ సేపు చెయ్యండి. 

మీ కళ్ళని గట్టిగా మూడు నుండి అయిదు సెకండ్ల పాటు ముసివేయ్యండి. ఇలా ఏడు లేక ఎనిమిది సార్లు చెయ్యండి. - మీ కళ్ళని మర్దనా చెయ్యండి. ఒక టవల్ ని వేడి నీటిలో అలాగే ఇంకొక టవల్ ని చల్లటి నీటిలోముంచండి . ఒక టవల్ ని తీసుకుని మీ ముఖం పై తేలికగా అద్దండి. కనుబొమ్మలు, మూసి ఉన్న కనురెప్పలు, చెంపలపై దృష్టిపెట్టండి. ఇలా ఒక సారి వేడి టవల్ తో ఒక సారి చల్లటి టవల్ తో చెయ్యండి. 

 ముఖానికి మర్దనా : ఒక టవల్ ని వెచ్చటి నీటిలో ముంచి. మెడ, నుదురు ఇంకా చెంపలని ఈ టవల్ తో మెల్లగా రుద్దండి. కళ్ళని మాత్రం తాకకండి. మీ వేళ్ళతో నుదురు ని అలాగే కళ్ళని సుతారంగా మర్దనా చెయ్యండి.  కనురెప్పల మర్దనా : మీ అందమైన కళ్ళు మూసుకుని మీ వేళ్ళతో వలయాకారంలో ఒకటి లేదా రెండు నిమిషాల వరకు మర్దనా చెయ్యండి. కంటికి హానీ కలగకుండా చేతులని శుభ్రంగా కడుగుకుని అలాగే చాలా తేలికగా మర్దనా చెయ్యడం ఇక్కడ ముఖ్యమైన విషయం. సుతారంగా రెండు చేతుల యొక్క మొదటి మూడు వేళ్ళతో కనురెప్పల పై బాగాన్ని వత్తాలి. వత్తి ఉంచి ఒకటి లేదా రెండు సెకండ్లు ఉండి తరువాత తీసేయాలి. ఇలా అయిదు సార్లు చెయ్యాలి. 

 - లయబద్దమైన కదలికల్ని సాధన చెయ్యండి. - - ఒక పెద్ద గడియారం ముందు మీరు నిల్చున్నట్లు ఉహించుకొన్ది. గడియారం మధ్యలోకి చుడండి. ఆ తరువాత గంటల గుర్తుని మీ తల తిప్పకుండా చూడండి. మళ్లీ గడియారం మధ్యలోకి చూడండి. ఇప్పుడు ఇంకొక గంట గుర్తుని చుడండి. ఇలా 12 సార్లు చెయ్యండి. ఈ వ్యాయామాన్ని కళ్ళు మూసుకుని కూడా చెయ్యవచ్చు. 

   స్వల్పమైన విభిన్న నేపధ్యం కలిగిన ఒక సుదూర వస్తువు పైన మీ దృష్టిని కేంద్రీకరించండి. ఇలా ప్రతి గంటలో కొన్ని నిమిషాల పాటు చెయ్యాలి. - - పైకి కింది మీ కళ్ళ కదలికలు చేయండి. ఇలా ఎనిమిది సార్లు చెయ్యాలి. ఆ తరువాత ఒక పక్క నుండి ఇంకొక పక్క వరకు కళ్ళని కదిలించండి. ఎడమవైపు తో ఈ పద్దతి పాటించాలి. ఇలా ఎనిమిది సార్లు చెయ్యాలి. మీ కంటిపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడండి. 

   ఈ పద్దతులని అరచేతులతో కళ్ళని కప్పడం లేదా వేరే ఏదైనా కళ్ళకి విశ్రాంతి కలిగే పద్దతితో ముగించాలి. చిట్కాలు కళ్ళ వ్యాయామాన్ని ఎక్కువ సేపు చెయ్యడం కంటే ప్రతి రోజు క్రమం తప్పకుండా చెయ్యడం ముఖ్యం. ప్రతి గంటలో ముప్పై నుండి అరవై సెకండ్ల కళ్ళ కదలికలు సరిపోతాయి. ఒక వేళ మీరు కంప్యూటర్ వద్ద ఎక్కువ సేపు పని చేస్తున్నప్పుడు మీ కళ్ళ ని వలయాకారంలో అప్పుడప్పుడు తిప్పడం ద్వారా రోజూ లాగా కంటిపై పడే ఒత్తిడి తగ్గుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: