ప్రస్తుతం చాలా మంది యువతులను అవాంఛితరోమాలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ అవాంఛిత రోమాలను తగ్గించడానికి క్రీమ్స్,రేజర్స్,వాక్సింగ్స్ వంటివి చాలా అవసరం అవుతుంటాయి. మరికొంతమంది పార్లర్ కి వెళ్ళి మరీ తీయించుకుంటుంటారు. ఇంకొంతమంది లేజర్ ట్రీట్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు.ప్రస్తుతం చాలామంది కరోనా కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చాలామంది వీటిని తొలగించుకోలేక  ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారి కోసమే ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చాము ఒక హోమ్ రెమెడీ. ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న చిట్కా పాటించి,మీ అవాంచిత రోమాలను ఇట్టే తొలగించుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:
టూత్ పేస్ట్
బేకింగ్ సోడా
వేడినీరు
తయారీ విధానం:
ఒక బౌల్లో బటాని గింజ సైజు లో టూత్ పేస్ట్ ను తీసుకొని, అందులో పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా వేడి నీరు పోసి మూడింటిని బాగా కలపాలి.

ఇప్పుడు ఇందులో ఒక కాటన్ బాల్ తీసుకొని మీకు ఏ ప్రదేశం లో అయితే అవాంఛితరోమాలు ఉన్నాయో? వాటిపైన మిశ్రమంలో అద్దిన కాటన్ బాల్తో అవాంఛిత రోమాల పైన రాయండి.ఆ తరువాత ఈ మిశ్రమం మీ శరీరంలోకి ఇమిడిపోయే వరకు చేతులతో బాగా మసాజ్ చేయాలి.తర్వాత 15నిముషాలు అలాగే ఆరనివ్వండి. అలాగే గోరువెచ్చని నీటితో మీ చర్మాన్ని కడిగేసుకోవాలి. వారానికి రెండు నుంచి మూడు రోజులు పాటు ఈ పద్ధతిని పాటిస్తే మీ అవాంఛిత రోమాలు రాలిపోవడాన్ని మీరే గమనిస్తారు.

టూత్ పేస్ట్ మన  చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి,ఆ ప్రదేశంలో బ్యాక్టీరియాను నివారించడానికి సహాయపడుతుంది.ఇక బేకింగ్ సోడా శరీరంపై ఉండే నలుపు ను తగ్గించి,డెడ్ స్కిన్ సెల్స్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా క్లెన్సర్ గా కూడా ఉపయోగపడుతుంది. రోమాలను తొలగించడంలో బేకింగ్ సోడా  మొదటి పాత్ర వహిస్తుంది. అయితే మీరు వాడే ఈ పద్ధతిని మీకు సెట్ అవుతుందో? లేదో? అని చెక్ చేసుకొని పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: