చాలా మందిని వీధించే సమస్య పాదాల పగుళ్లు. ఈ సమస్య చాలా మందికి యవ్వనం నుంచే వస్తుంది. కనుక చాలా మంది ఈ సమస్యతో సతమతమవుతూ వుంటారు.కొంతమంది చాలా అందంగా కనపడతారు. వారికి కూడా ఈ పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇక పాదాల పగుళ్లు తగ్గడానికి  చక్కటి పద్ధతి వ్యూమిస్ స్టోన్. దానితో ఇలా చెయ్యడం వలన పాదాల సమస్య అనేది తగ్గుతుంది.పగుళ్లున్న చోట ఈ ప్యూమిస్ స్టోన్‌తో వృత్తాకారంలో మసాజ్‌లా చేయడం వల్ల పొడిబారిన చర్మం.. పొడిలా మారి కిందకు రాలిపోతుంది. ఈ ప్రక్రియ ముగిశాక మీ పాదాలను మరోసారి గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోండి. ఆ తర్వాత పాదాలకు ఉన్న తడి ఆరాక ఏదైనా మాయిశ్చరైజర్ లేదా క్రీమ్‌ను అప్లయ్ చేసి స్పూత్‌గా రబ్ చేయండి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే కొన్ని వారాల్లో మీ పాదాలపై పగుళ్లనేవే కనిపించవు.కొంచెం గోరు వెచ్చని నీటిలో కొంచెం షాంపూ లేదా నూనె వేసి కలపండి. ఇందులో మీ పాదాలు ఓ పావు గంట సేపు ఉంచితే చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. పాదాలు నాని, మెత్తబడతాయి.


ఆ తర్వాత ఇదే నీటిలో ప్యూమిస్ స్టోన్‌ను కొన్ని సెకెన్లపాటు ముంచి తీయండి. ఇప్పుడు మీ పాదాలను ఆ నీటిలో నుంచి బయటకు తీసి అదే ప్యూమిస్ స్టోన్‌తో నెమ్మదిగా రబ్ చేయండి. ఇలా చేయడం వల్ల చర్మంపైనున్న మృతక‌ణాలు బయటకు వచ్చేస్తాయి.ప్యూమిస్ స్టోన్ కొనేసి తెచ్చి స్నానం చేసే ముందో లేదా నార్మల్ ఈవెనింగ్స్‌లో ఉపయోగిస్తుంటారు. ఐతే.. ఎప్పుడు ఉపయోగించినా దీనికంటూ ఓ ప్రొసీజర్ ఉందని అంటున్నారు నిపుణులు. ఎలాగోలా వాడేస్తే ఈ ప్యూమిస్ స్టోన్ వల్ల ఉపయోగం ఉండదని చెబుతున్నారు. అందుకే పైన చెప్పిన విధంగా వాడారంటే మీకు ఉపయోగం ఉంటుంది.ప్యూమిస్‌ స్టోన్‌ను ఎంత శుభ్రంగా స్టోర్ చేసినా సరే కొన్నిసార్లు బ్యాక్టీరియా వంటివి చేరుతుంటాయి. అందుకే మూడు లేదా నాలుగు నెలలకోసారి ఈ స్టోన్‌ను మార్చాలి. బ్యాక్టీరియా చేరిన ప్యూమిస్ స్టోన్ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ.ప్యాక్ చేసిన ప్యూమిస్ స్టోన్‌ను వారానికి ఒక్క సారైనా స్టెరిలైజ్ చేసుకుంటుండాలి. లేదా వేడి నీళ్లలో ఓ ఐదు నిమిషాలపాటు ఉంచినా బ్యాక్టీరియా వంటివి దరిచేరనీయదు.

మరింత సమాచారం తెలుసుకోండి: