
ఆ కొత్త ప్రాజెక్ట్ గురించి చెబితే — అది మరెవరో కాదు, తమిళ సినీ ఇండస్ట్రీ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఇండియన్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న లోకేష్ ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి ఓ స్పై థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందించబోతున్నట్లు టాక్. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం ప్రభాస్ అభిమానులకు ఇది నిజంగా గోల్డెన్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ యాక్షన్ ట్రీట్మెంట్, స్క్రీన్‌ప్లే స్టైల్ మరియు సస్పెన్స్ హ్యాండ్లింగ్‌లో మాస్టర్ అని చెప్పాలి. అలాంటి డైరెక్టర్‌తో ప్రభాస్ కాంబినేషన్ అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తానికి భారీ కాంబినేషన్ అని చెప్పక తప్పదు.
ఇప్పటికే ప్రభాస్ చేతినిండా సినిమాలు ఉన్నాయి — “కల్కి 2898 ”, “రాజాసాబ్”, “స్పిరిట్”, అలాగే హను రాఘవపూడి సినిమా. ఈ షెడ్యూల్ మధ్యలో కూడా స్టార్ డైరెక్టర్స్‌కి అవకాశం ఇవ్వడం ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, డెడికేషన్ ఏ స్థాయిలో ఉందో చెబుతోంది. అభిమానుల నమ్మకం ఒక్కటే — “ప్రభాస్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వడం ఖాయం!”ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్–లోకేష్ కాంబోపై వచ్చిన ఈ వార్త వేగంగా వైరల్ అవుతూ, నెట్టింట ట్రెండింగ్ టాపిక్స్ లిస్ట్‌లో కూడా హ్యాష్‌ట్యాగ్‌లుగా కనిపిస్తోంది. అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో “#PrabhasWithLokeshKanagaraj”, “#RebelSpyMovie” అనే ట్యాగ్‌లతో పోస్టులు పెడుతున్నారు.ప్రభాస్ వరుసగా స్టార్ దర్శకులతో సినిమాలు చేయడం, తన ప్రాజెక్ట్‌లను పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేయడం ఆయన స్టార్‌డమ్‌కి మరింత బలాన్ని ఇస్తోంది. అభిమానుల మాటల్లో చెప్పాలంటే — “ఇండియన్ సినిమా భవిష్యత్తు ప్రభాస్ చేతుల్లోనే ఉంది” అని చెప్పడం అతిశయోక్తి కాదు.