గత కొన్ని రోజులుగా వరుస ట్వీట్లతో వార్తల్లో నిలుస్తున్న నాగబాబు తాజాగా మతం, నైతికత, విజ్ఞానం గురించి ట్వీట్ చేశారు. సమాజంలో మతం, విజ్ఞానం, నైతికత మూడు వేరువేరు స్తంభాలని... ప్రపంచంలోని చాలా మతాలు నైతికత మరియు సైన్స్ తో మిళితమై ఉన్నాయని పేర్కొన్నారు. విజ్ఞాన శాస్త్రం మరియు నైతికత ఏ మతాలకు సరిగ్గా సరిపోవని... అందువల్లే ప్రపంచంలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయన పేర్కొన్నారు. 
 
గతంలో గాంధీ, గాడ్సే గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాగబాబు ఈసారి తన ట్వీట్లో మతం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. నాగబాబు ఈసారి మతం గురించి పోస్ట్ చేయడం వెనుక గల కారణాలు తెలియాల్సి ఉంది. నాగబాబు ట్వీట్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు " మీ వ్యక్తిగత అభిపాయాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల మీ తమ్ముడి పార్టీకి నష్టం వాటిల్లుతోంది" అని కామెంట్లు చేయగా మరికొందరు " మత ప్రస్తావన లేని పార్టీకి చెందిన నేతలు మతం గురించి ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు" అని కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: