త్రివిధ దళాల ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గుండ్రా సతీష్ రెడ్డితో  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఏపీ కొత్త పారిశ్రామిక విధానంలో 'డిఫెన్స్'పై  ప్రత్యేకంగా దృష్టి సారించామని ఆ రంగంలో అభివృద్ధికి  డీఆర్డీవో సహకారం కావాలని మంత్రి మేకపాటి కోరారు.  నౌకదళాల అధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్ తో మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. దొనకొండలో సోనిక్ (ధ్వని తరంగాలకు సంబంధించిన) వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి కోరారు.


ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు వద్ద  యుద్ధాల సమయంలో ఉపయోగపడే 'నేవీ బేస్' స్థాపించాలని మంత్రి మేకపాటి కోరారు. యుద్ధాలు జరిగే సమయంలో ఏవైనా విమానాలు, ఓడలు మరమ్మతులకు గురైనపుడు నేవీ ఆధ్వర్యంలో నావల్ బేస్ ద్వారా విమానాలకు ఓడలలో తాత్కాలికంగా ఆశ్రయం పొందే అవకాశముంటుంది. అనంతరం,  వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బి.ఎస్.ధనోవాను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలోని రక్షణ వ్యవస్థ, అభివృద్ధికి సహకారం కోసం మంత్రి మేకపాటి చర్చించారు. ఈ సమావేశం అనంతరం మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని మంత్రి మేకపాటి హైదరాబాద్ చేరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: