మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్​నాథ్ తననుద్దేశించి 'కుక్క' అన్నారంటూ బిజేపి ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా ఆరోపించారు. మధ్యప్రదేశ్​లోని శాడోరాలో నిర్వహించిన ఉప ఎన్నికల ప్రచారసభలో సింథియా ఆ ఆరోపణలు చేశారు. ఈ విషయమై ఆయన పలు వ్యాఖ్యలు కూడా చేశారు.



కమల్నాథ్ ఇక్కడకు వచ్చి నన్ను 'కుక్క' అని సంబోధించారు. అవును నేను అదే. ప్రజలే నా యజమానులు. కుక్క ఎప్పుడూ తన యజమానిని కాపాడుకుంటుంది" అని సింథియా వ్యాఖ్యానించారు.సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది.గతంలోనూ కమల్నాథ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి, బిజేపి అభ్యర్తి ఇమార్తి దేవిని 'ఐటమ్' అని అన్నారు. దీంతో మోడల్ కోడ్ను పలుమార్లు ఉల్లంఘించిన కారణంగా కమల్నాథ్ 'ముఖ్య ప్రచారకర్త' స్టేటస్ను తొలగించింది ఎన్నికల కమిషన్

మరింత సమాచారం తెలుసుకోండి: