రిజర్వేషన్​ వ్యవహారంలో రాజస్థాన్​లో గుర్జర్లు మరోమారు ఆందోళన బాటపట్టారు. భరత్​పుర్​లోని బయానాలో కొందరు యువకులు.. రైల్వేట్రాక్​పై బైఠాయించారు. ఫలితంగా హిణ్​డైన్​ సిటీ-బయానా మార్గంలో ప్రయాణించే 7 రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. ఈ ఆందోళనలతో ఢిల్లీ-ముంబయి రైలు మార్గంలో ట్రాఫిక్​పై ప్రభావం పడుతుందని చెప్పారు.గుర్జర్​​​ ఆరాక్షన్​ సంఘర్ష్​ సమితి ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు కొన్ని జిల్లాల్లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో అంతర్జాల సేవలు నిలిపివేశారు.


రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్​ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం గుర్జర్లకు రిజర్వేషన్లు కల్పించాలి.ఖాళీల బ్యాక్​లాగ్​లను త్వరితగతిన భర్తీ చేసి, పెండింగ్​లో ఉన్న నియామక ప్రక్రియలో అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ) వారికి 5శాతం రిజర్వేషన్​ ఇవ్వాలి.14 పాయింట్ల ఒప్పందం ప్రకారం.. ప్రొబేషన్​ పీరియడ్​ పూర్తి చేసుకున్న 1,252 మంది ఉద్యోగులకు రెగ్యులర్​ పే స్కేల్​ ఆధారంగా వేతనాలివ్వాలి అని వారి డిమాండ్.

మరింత సమాచారం తెలుసుకోండి: