చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ షేన్‌ వాట్సన్‌(39) ఫ్రాంఛైజీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఐసీసీ 20-20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా మొహాలీలో భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్ తర్వాత ఈ వెటరన్ ఆల్‌రౌండర్ క్రికెట్‌ నుంచి వైదొలిగాడు. అయితే, షేన్ వాట్సన్‌కు ఘనమైన వీడ్కోలు మాత్రం దక్కలేదని చెప్పొచ్చు.

అయితే ఈ మ్యాచ్‌లో 18 పరుగులు చేసిన వాట్సన్.. రోహిత్, రైనా వికెట్లు తీసి భారతను దెబ్బతీశాడు. ఇక యువరాజ్‌ క్యాచ్‌ను కూడా అందుకున్నాడు. అయితే మ్యాచ ఓడటంతో వాట్సన్ రిటైర్మెంట్‌కు పెద్దగా ప్రాముఖ్యత లభించలేదు. మ్యాచ్ ముగిశాక గ్రౌండ్‌లో వాట్సన్ తన ఇద్దరు పిల్లలతో ఆడుకుంటూ కనిపించాడు. వాట్సన్‌ గతేడాది యాషెస్‌ సిరీస్‌ తర్వాత టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే సుమారు ఆర్నెల్లుగా వన్డేలకూ ఎంపికకాలేదు. షేన్ వాట్సన్ వన్డే కెరీర్‌లో 190 మ్యాచ్‌లు ఆడి 5757 పరుగులు చేశాడు. అలాగే, 168 వికెట్లు పడగొట్టాడు. ట్వంటీ-20ల్లో 58 మ్యాచ్‌లు ఆడి 1462 పరుగులు చేయగా, 48 వికెట్లు తీశాడు. తన ట్వంటీ-20 చివరి మ్యాచ్‌‍లో రెండు వికెట్లు తీశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: