విశాఖ‌ప‌ట్నం ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు నిర‌స‌న‌గా ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తోన్న ఉద్యోగులు, కార్మిక సంఘాల‌కు మ‌ద్ద‌తు ప‌లికేందుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విశాఖ‌ప‌ట్నం రానున్నారు. ఇప్ప‌టికే కేటీఆర్ విశాఖ ఉక్కు ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించారు. త్వ‌ర‌లోనే విశాఖ వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు జ‌రుగుతున్న తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ముగియ‌గానే కేటీఆర్ విశాఖ‌ప‌ట్నం వ‌స్తార‌ని మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు చెప్పారు. గంటా రెండురోజుల క్రిత‌మే హైద‌రాబాద్‌లో కేటీఆర్‌ను క‌లిసి విశాఖకు రావాల్సిందిగా ఆహ్వానించారు. మంత్రుల రాజీనామాకు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని, చంద్ర‌బాబునాయుడు త‌న సీనియారిటీని ప‌క్క‌న‌పెట్టి జ‌గ‌న్‌తో న‌డ‌వడానికి కూడా సిద్ధ‌మ‌య్యార‌న్నారు. తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన‌చోట పోటీచేయ‌న‌ని, ఆ స్థానంలో ఉక్కు క‌ర్మాగారం నిర్వాసితుణ్ని నిల‌బ‌డెతాన‌ని ప్ర‌క‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: