దేశ రాజ‌ధాని ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒకప్పటి అండర్ వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్‌కు ఏప్రిల్ 26వ తేదీన‌ వైర‌స్ సోకిన విష‌యం తెలిసిందే. అయితే రాజ‌న్ ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మార‌డంతో..  అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ చోటా రాజ‌న్ మృతి చెందాడు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం చోటా రాజ‌న్ తుది శ్వాస విడిచారు.  కొవిడ్‌ సోకడంతో ప్రత్యేక వార్డులో సాయుధ పోలీసుల పర్యవేక్షణలో అతనికి చికిత్స అందించిన‌ప్ప‌టికీ, ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు త‌ర‌లించి చికిత్స అందించారు. అయినప్పటికి ఆయన కరోనాతో పోరాడి ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: