వరంగల్ అర్భన్ జిల్లా షోడషపల్లి శివారు లోక్యా తండాలో మైనింగ్ మాఫియా అంశం తెర మీదకు వచ్చింది. అధికార పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు చెప్పి ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ తో కోట్లు అక్రమార్కులు కొల్లగొడుతున్నట్టు తెలుస్తోంది. మైనింగ్ మాఫియాకు అండగా నిలిచి దందాకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సోదరి చాడా సరిత మద్దతు పలుకుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ దందాను అడ్డుకున్న అధికారులపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు చెప్పి ఆయన సోదరి చాడా సరిత బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం.



 అంతే కాక మైనింగ్ అక్రమార్కులపై జరిమానాలు విధించ వద్దని వేలేరు తహసీల్దార్ పై సరిత తీవ్ర బెదిరింపులకు దిగినట్టు చెబుతున్నారు. జరిమానా విధించ వద్దనేది నా మాట కాదు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట అంటూ తహసీల్దార్ కు ఆయన సోదరి చెప్పారని ప్రచారం జరుగుతోంది. అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమించినందుకు తహసీల్దార్ ను అధికారులు బదిలీ చేశారని ప్రచారం జరుగుతోంది. మరి భూముల కబ్జా చేశారని అంటూ ఈటెలను బయటకు పంపిన టీఆర్es ఏఎ అంశం మీద ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs