వివేకా హత్య కేసులో సీబిఐ అధికారులు వేధిస్తున్నారంటూ సునీల్ కుటుంబం పులివెందులలో మీడియా సమావేశం నిర్వహించింది. సునీల్ కు వివేకా హత్యతో ఎలాంటి సంబంధం లేదని, అతనికి ఏ పాపమూ తెలియదని, వారికి ధైర్యం, నిజాయతి ఉంటే అసలైన నిందితులను పట్టుకోవాలని అన్నారు. వివేకాతో సునీల్ సన్నిహితంగా ఉండడం వాస్తవేమని, ఆయన చాలా మంచివాడని, కానీ సన్నిహితంగా ఉన్న కారణంగా సునీల్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని, వాచ్ మెన్ రంగన్న మాటల్లో వాస్తవం లేదుని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి వేధింపులు తట్టుకోలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికే గోవా వెళ్లినట్టు చెప్పి షాకిచ్చారు. కానీ అలా చనిపోతే తమ కుటుంబంపై వేసిన నిందలు నిజమే అంటారని పులివెందులకు తిరిగి వచ్చినట్టు వెల్లడించారు. సునీల్ ను 24 గంటల్లో సీబిఐ అధికారులు ఇంటికి పంపక పోతే కుటుంబం మొత్తం ఆత్మ హత్య చేసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం సీబిఐ అదుపులో సునీల్ కుటుంబం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: