పెట్రోల్ డీజిల్ ధరలకు బ్రేకులు లేకుండా పోయాయి. ఇప్పటికే ధరలు పెరుగుతూ పెరుగుతూ 100 దాటాయి. దాంతో దేశంలోని వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరల ప్రభావం ఇతర వస్తువుల పైనా చూపడంతో అన్ని నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేసింది. 

డీజిల్ పెట్రోల్ దిగుమతి సుంకాలను తగ్గించమని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ క్లారిటీ ఇచ్చారు  గతంలో ఇచ్చిన సబ్సిడీల బకాయిల చెల్లింపు.. పెట్రోల్ ధరల తగ్గింపుకు ఆటంకం అని నిర్మలమ్మ వ్యాఖ్యానించింది. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేందుకు యూపీఏ ప్రభుత్వం రూ. 1.44 లక్షల కోట్ల బాండ్లను జారీ చేసిందని వాటికి తమ ప్రభుత్వం ఇంకా వడ్డీలు చెల్లిస్తుందని నిర్మలా సీతారామన్ అన్నారు. అంతేకాకుండా గత ఐదేళ్లలో 60 వేల కోట్ల వడ్డీ లు చెల్లించామని ఇప్పటికీ 1.3 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. అందువల్లే పెట్రోల్ ధరను తగ్గించలేమని సామాన్యుడికి షాక్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: