తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మకు చెందిన ప్ర‌ముఖ నిర్మాత మ‌హేష్ కోనేరు ఈరోజు హ‌ఠాత్తుగా మృతిచెందారు. గుండెపోటు రావ‌డంతో విశాఖ‌ప‌ట్నంలో ఆయ‌న మ‌ర‌ణించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్‌కు వ్య‌క్తిగ‌త పీఆర్ గా ప‌నిచేశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఆయ‌న 118, తిమ్మ‌రుసు, మిస్ ఇండియా చిత్రాల‌ను నిర్మించారు. మ‌హేష్ కోనేరు మృతిపై జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ల్యాణ్రామ్‌తోపాటు ప‌లువురు నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, న‌టులు సంతాపాన్ని తెలియ‌జేశారు. క‌ల్యాణ్‌రామ్ క‌థానాయ‌కుడిగా 118 చిత్రాన్ని నిర్మించారు. దీనికి కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అలాగే స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా తిమ్మ‌రుసు చిత్రాన్ని నిర్మించారు. శ‌ర‌ణ్ కొప్పిశెట్టి దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కీర్తిసురేష్‌, జ‌గ‌ప‌తిబాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్ తదిత‌రులు న‌టించిన మిస్ ఇండియా చిత్రాన్ని కూడా నిర్మించారు. న‌రేంద్ర‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో విడుద‌లైంది. మ‌రోచిత్రాన్ని నిర్మించ‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్న స‌మ‌యంలో మృతిచెంద‌డంపై క‌ల్యాణ్‌రామ్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: