జగన్ తో శారదా పీఠాధిపతి భేటీ... కారణం ఏంటి ?

విశాఖపట్నంలో వెలసియున్న శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన స్వామీజీ ముఖ్యమంత్రితో దాదాపు గంటకు పైగా గడిపారు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసారు. విశాఖ పట్నం లోని ఆశ్రమంలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయని స్వామీజీ ముఖ్యమంత్రికి తెలిపారు. వార్షిక మహోత్సవాల్లో పాల్గొని శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం పొందాలని సూచించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆశీస్సులు పొందాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వెంట ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలకు తెలంగామ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్ర శేఖర్ రావు కూడా హజరవుతారని సమాచారం. అక్కడి రాజశ్యామల అమ్మవారిని గతంలో కెసిఆర్ దర్శించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: