సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు.. కళాతపస్విగా పేరొందిన  కె. విశ్వనాథ్‌ కన్నుమూశారు. 92 ఏళ్ల వయస్సులో ఆయన జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన పార్థివదేహం అపోలో ఆస్పత్రి నుంచి  ఫిలింనగర్‌లోని స్వగృహానికి తరలించారు.


శంకరాభరణం సినిమా విడుదలైన రోజే కళాతపస్వి కె. విశ్వనాథ్‌ శివైక్యం చెందారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌... ఐదు దశాబాద్దాల పాటు తెలుగు చిత్రసీమపై చెరగని ముద్ర వేశారని చెప్పొచ్చు. దాదాపు 60కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కళాతపస్వి కె. విశ్వనాథ్‌.. సినిమాను సంస్కృతి సారధిగా భావించి కళామతల్లి సేవ చేశారు. కె.విశ్వనాథ్ మృతి పట్ల తెలుగు ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ సంతాపం తెలిపారు. కళాతపస్వి విశ్వనాథ్‌ మృతిపట్ల చిరంజీవి సహా పలువురు సినీరంగ ప్రముఖులు సంతాపం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: