కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం అస్తవ్యస్తం అయిన సంగతి తెలిసిందే.. ఆర్దికంగా కుదేలు అయిన సంగతి తెలిసిందే.. ధనవంతుడు నుంచి పేదవాడి వరకు అందరూ కూడా ఆర్దికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. ఇప్పటికీ కూడా ఎదుర్కొంటున్నారు.. అయితే తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే బ్యాంకుల కోసం వెతుకుతున్నారు.. కొంత మంది ఏదోక బ్యాంకు కదా అని వడ్డీ విషయాన్ని పక్కన పెట్టి రుణాలను అందుకుంటున్నారు.. వాటిని కట్టుకోవడానికి నానా ఇబ్బందులను ఎదుక్కొంటున్నారు.. కొందరు కట్టలేక ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.. ఇక మీదట అలాంటి భాధలు పడాల్సిన పని లేదని అంటున్నారు..



ఇలాంటి వారికి ఒక స్కీమ్ అందుబాటులో ఉంది. అదే ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు సొంతంగానే వ్యాపారం ప్రారంభించొచ్చు..ఈ స్కీమ్ కు అర్హత కలిగిన వాళ్ళు  దాదాపు 25 లక్షల వరకు రుణం పొందవచ్చు అని అంటున్నారు.అంతేకాకుండా 15 నుంచి 25 శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది. మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు, యువత ప్రయోజనం పొందొచ్చు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు..



ఈ పథకాన్ని కేంద్రం 2008 లో అందుబాటులోకి తీసుకువచ్చింది..దాదాపుగా 11 లక్షల మంది ఈ స్కీమ్ కింద లబ్ధి పొందినట్లు తెలుస్తుంది..18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ స్కీమ్ కింద బెనిఫిట్ పొందొచ్చు.. కనీసం ఎనిమిదో తరగతి అయిన చదివి ఉండాలని అంటున్నారు. కొత్తగా వ్యాపారం చేసుకోవాలని అనుకునేవారు ఈ స్కీమ్ ద్వారా లబ్ది పొందవచ్చునని అంటున్నారు. https://www.kviconline.gov.in/pmegpeportal/pmegphome/index.jsp సైట్ ద్వారా లోన్ ను పొందవచ్చును..అలాగే 15 శాతం నుంచి 25 శాతం వరకు సబ్సిడీ బెనిఫిట్ కూడా పొందొచ్చు అని అంటున్నారు.. ఈ పథకం ఇప్పుడు అందరి కలలను సాకారం చేస్తుందని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: