ఇక ఈ రోజుల్లో చాలామంది సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కలలు కంటారు.ఏదో ఒక ఉద్యోగం చేసే కన్నా మనమే సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలి అని వారు అనుకుంటారు.ఇలా మీరు సొంతంగా వ్యాపారం చేయాలని అనుకుంటున్న వారు ఈ బిజినెస్ కనుక చేశారంటే చాలా వరకు కూడా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. మనం చేయాలనుకుంటే ఈ భారత దేశంలో ఎన్నో వ్యాపారాలు మనకు చాలా అందుబాటులో ఉన్నాయి.ఇక అందులో ఒకటే మసాలా దినుసుల వ్యాపారం. మన భారతదేశంలో వివిధ రకాల మసాలా దినుసులను మన వంటలలో ఉపయోగిస్తారు. ఈ సుగంధ ద్రవ్యాలకు ఎప్పుడు కూడా డిమాండ్ బాగా ఉంటుంది. ఈ సుగంధ ద్రవ్యాల రేటు ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. అందువలన వ్యాపారం చేయాలని అనుకుంటున్న వారు ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తే ఖచ్చితంగా మంచి లాభాలను పొందవచ్చు.ఇక ఈ వ్యాపారం ప్రత్యేకత ఏమిటంటే ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి మీరు ఎక్కువ డబ్బును ఖర్చు చేయనవసరం లేదు. మీరు మీ ఇంటి వద్ద ఈ పనిని ప్రారంభిస్తే ఇందులో ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు. భారతీయ వంట గదిలో సుగంధ ద్రవ్యాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. దేశంలో సుగంధద్రవ్యాలు టన్నులలో ఉత్పత్తి అవుతున్నాయి. మీకు ఈ సుగంధ ద్రవ్యాలపై అవగాహన కనుక ఉంటే మీరు మసాలా తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడం ద్వారా అధిక మొత్తంలో ఆదాయం అనేది పొందవచ్చు.


అయితే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ స్ కమిషన్( kVIC )మసాలా దినుసుల యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఖర్చు ఇంకా ఆదాయాలపై ఒక నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు మొత్తం రూ.3.50 లక్షలు వెచ్చించనున్నారు.అలాగే 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో బిల్డింగ్ షెడ్డు 60,000, యంత్రాల ధర 40,000.వెచ్చించనున్నారు.ఇంకా ఇవి కాకుండా పనులు ప్రారంభించడానికి అయ్యే ఖర్చు రూ.2.50 లక్షల అవసరం. మిరపకాయలు, పసుపు ఇంకా కొత్తిమీర మొదలైనవి రుబ్బుకోవడానికి గ్రైండర్ అవసరం. అవి చాలా పెద్దవి కావు ఇంకా ఖర్చు కూడా తక్కువే. వాటిని ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేయవచ్చు. పసుపు, ఎండుమిర్చి, ఎండుమిరపకాయ, జీలకర్ర ఇంకా కొత్తిమీరలను ముడి పదార్థాలుగా ఉపయోగించి గ్రైండ్ చేసి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. ఇది ప్రతి నగరంలో కూడా సులభంగా కనిపిస్తాయి. ఈ ప్రాజెక్టు నివేదిక ప్రకారం సంవత్సరంలో మొత్తం 193 క్వింటాళ్ల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతాయి. ఇక క్వింటాకు రూ. 5,400 చొప్పున అమ్మితే సంవత్సరంలో రూ. 10.42 లక్షల వరకు ఆదాయంని పొందవచ్చు. ఇందులో ఖర్చులన్నీ కూడా తీసేస్తే ఏటా 2.54 లక్షల లాభం వస్తుంది. అంటే నెలకు రూ. 21 వేలకు పైగా సంపాదన అనేది వస్తుంది. ఈ వ్యాపారం చేయడం వలన మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు తగ్గుతుంది. ఇంకా లాభం పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: