పాన్ కార్డ్‌ని  గుర్తింపును చూపించడానికి వాడవచ్చు.ఆధార్ కార్డు లేదా ఓటరు ID కార్డు కాకుండా ఇంకా గుర్తింపు రుజువుగా పాన్ కార్డును ఉపయోగించవచ్చు. వివిధ రకాల ఆర్థిక లావాదేవీల కోసం ఈ పాన్ కార్డులు ఆమోదించబడతాయి.ఇక మీరు సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, రూ.50,000 కంటే ఎక్కువ లావాదేవీల కోసం సంబంధిత అధికారులకు మీ పాన్ కార్డ్ వివరాలను అందించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్లు ఇంకా అలాగే ఈక్విటీకి కూడా పాన్ కార్డ్ సమాచారం అనేది చాలా అవసరం.ఇక అలాగే లోన్ దరఖాస్తు సమయంలో, మీరు మీ పాన్ కార్డ్‌తో సహా అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లను కూడా సమర్పించాలి. ఎడ్యుకేషన్ లోన్ ఇంకా అలాగే పర్సనల్ లోన్ లేదా మరేదైనా  రుణం కోసం పాన్ కార్డ్ అనేది అవసరం. ఇంకా అలాగే ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి అర్హత ఉన్న వ్యక్తులు ఇంకా అలాగే సంస్థలు తప్పనిసరిగా పాన్ కార్డ్‌ని కలిగి ఉండాలి.ఇంకా అలాగే బ్యాంక్ ఖాతాను తెరవడానికి పాన్ కార్డ్ కూడా ఉపయోగించబడుతుంది.ఇంకా మీరు ప్రాపర్టీని కొనుగోలు చేసేటప్పుడు, అద్దెకు ఇచ్చేటప్పుడు లేదా అమ్మేటప్పుడు పాన్ కార్డ్ అనేది రుజువుగా చాలా అవసరం.


ఇంకా అలాగే మీరు మీ భారతీయ కరెన్సీని విదేశీ కరెన్సీగా మార్చాలనుకుంటే.. మీరు మీ పాన్ కార్డ్ వివరాలను మనీ ఎక్స్ఛేంజ్ కంపెనీకి అందించాల్సి ఉంటుంది.ఇంకా వస్తువులు, సేవల కొనుగోలు లేదా అమ్మకం కోసం, కొనుగోలుదారు లేదా విక్రేత రూ. 2 లక్షల కంటే ఎక్కువ లావాదేవీల కోసం వారి పాన్ కార్డ్ వివరాలను ఖచ్చితంగా అందించాలి.ఇంకా అలాగే మీరు FDలో 50 వేల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడిని పెట్టాలనుకుంటే.. అప్పుడు పాన్ కార్డ్ అనేది చాలా అవసరం. FD వడ్డీ మొత్తంపై బ్యాంక్ TDSని తీసివేస్తుంది కాబట్టి ఇది చాలా అవసరం.ఇంకా అలాగే మీరు కొత్త ఫోన్ లేదా మొబైల్ కనెక్షన్ ని పొందాలనుకుంటే.. మీరు సెల్యులార్ ఆపరేటర్లకు మీ పాన్ నంబర్‌ను ఖచ్చితంగా ఇవ్వాలి.ఇంకా అలాగే నగలు కొనుగోలు చేస్తున్నప్పుడు.. అంటే రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన నగలను మీరు కొనుగోలు చేసేందుకు పాన్ కార్డు వివరాలను ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: