ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, గ్రీన్ టీ పౌడర్ వేసి కలపండి. ఇవి రెండూ బాగా కలిశాక పసుపు, బియ్యం పిండి వేసి మళ్ళీ కలపండి. ఇప్పుడు అందులో రోజ్ వాటర్ వేసి అన్నింటినీ కలపండి. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటెయినర్ లో స్టోర్ చేయండి. రాత్రి నిద్రకి ముందు కొద్దిగా తీసుకుని, అవసరమైతే ఇంకొంచెం రోజ్ వాటర్ కలిపి మొటిమల మీద అప్లై చేయండి. రాత్రంతా అలాగే ఉంచేసి పొద్దున్న చల్లని నీటితో కడిగేయండి.