తెల్లని ముఖం కోసం...ఒక టీ స్పూన్ షుగర్ లో రెండు చుక్కల నీరూ, రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. ఆరెంజ్, లెమన్, లావెండర్, టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్స్ లో ఏదైనా కలపవచ్చు. వీటిని బాగా మిక్స్ చేసి మృదువుగా స్క్రబ్ చేయండి. కడిగేసిన తరువాత అవసరమనుకుంటే ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు.