ఎంతందంగా వున్నావే ఎవరే నువ్వు అంటూ నాగార్జున పాడినట్టు,ఈకాలం అందమైన అమ్మాయిల్ని చూస్తే చాలు కుర్రకారు గుండే గన్‌లోని తూటాలా శబ్ధం చేస్తుంది.నిజం చెప్పాలంటే ఎలాంటి అమ్మాయికైన అందంగా కనబడాలని వుంటుంది. అబ్బాయిలచేత పొగిడిచ్చుకోవాలని అనిపిస్తుంది.కాని ముఖం పైన అప్పుడప్పుడు ఏర్పడే చిన్న చిన్న మచ్చలు,దిష్టి చుక్కలా కనిపిస్తాయి.ఇక దిగులెందుకు ఇప్పుడు చెప్పబోయేది ఒక్క సారి ట్రై చేసి చూడండి.ఇక మనలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అయినా కూడా ఎలాంటి ప్రయత్నం ఫలించిన దాఖాలు కనిపించవు.ఈ నిద్రలేమి కారణంగా, ముఖంపై కళ్లక్రింద మచ్చలు,మెుటిమలు వంటివి వస్తుంటాయి.



అందుకే నిద్రలేమికి దూరంగా ఉండాలంటే..వాము తీసుకోవాలని చెబుతున్నారు.ఎందుకంటే వాము ఆరోగ్యానికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుందట..నిద్రలేమిని తరిమి కొడుతుందట.వీటివలన వచ్చిన మెుటిమలు,మచ్చలను కూడా తొలగిస్తుందట.ఇక ముఖం పై మచ్చలు తొలగాలంటే ఇలా చేస్తే చాలట.అదేంటంటే వాముపొడి,పావుస్పూన్..వంటసోడా, సెనగపిండి కొద్దిగా,మీగడ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకోవాలి.20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా చేస్తే నిద్రలేమి కారణంగా వచ్చిన మెుటిమలు తొలగిపోతాయి.



జాజికాయను వెచ్చని నీటిలో అరగదీసి దాని ద్వారా వచ్చినా గంధాన్ని తీసి అందులో కొద్దిగా వాము పొడి,పాలు కలిపి మెుటిమల పై రాయాలి.గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.ఇలా తరచుగా చేస్తే నల్లటి మచ్చలు పోతాయి. వామును నూనెలో వేయించి మెత్తని చూర్ణంలా తయారుచేసుకోవాలి.ఇలా చేసిన మిశ్రమంలో కొద్దిగా పెరుగు కలిపి మెుటిమలపై పూతలా వేసుకోవాలి.15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.చూసార హస్పిటల్స్ అని మందులని ఎందుకండి పరిగెడుతారు ఏం చక్కా ఇంట్లో వున్న వాటితోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి వాటివి ట్రై చేసి చూడండి..

మరింత సమాచారం తెలుసుకోండి: