జుట్టు రాలడం, జుట్టు చిట్లడం, చుండ్రు మరియు ఇతర అనేక జుట్టు సమస్యల్లో జుట్టు రాలడం చాలా ప్రధానమైనదిగా ఉంటుంది. అయితే ఈ సమస్యలను పరిష్కరించడానికి, జుట్టు ఆరోగ్యంగా మరియు బలంగా ఉండటం కోసం మనం ఎన్నో ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తుంటాం. ఈ క్ర‌మంలోనే రకరకాల నూనెలు, షాంపూలను ఉపయోగిస్తుంటారు. అయితే ఈసారి మీ జుట్టు సమస్యలను నివారించుకోవడానికి నూనెలు, షాంపూలు కాకుండా ఇటా ట్రై చేసి చూడండి. 

 

సాధార‌ణంగా వాసెలిన్ చర్మ ప్రయోజనాలకు ఉప‌యోగిస్తుంటారు. అయితే చ‌ర్మానికే కాకూండా జుట్టు రాలకుండా తొందరగా పొడవు పెరగటానికి కూడా సహాయపడుతుంది. ఇప్పుడు ఆ చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ చిట్కా తల మీద చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి జుట్టు రాలకుండా బాగా పెరిగేల ప్రోత్సహిస్తుంది.ఈ చిట్కాకు వాసెలిన్, విటమిన్ E క్యాప్సిల్, కొబ్బరి నూనె అవసరం అవుతాయి. ఒక బౌల్ లోకి ఒక స్పూన్ వాసెలిన్, ఒక స్పూన్ కొబ్బరి నూనెను,రెండు విటమిన్ E క్యాప్సిల్స్ లోని ఆయిల్ ని వేసి బాగా కలిపి తల మీద చర్మం మీద వృత్తాకార మోషన్ లో ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. 

 

మసాజ్ చేసాక రాత్రంతా ఆలా వదిలేసి మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూ తో తలస్నానము చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు బ‌లంగా మారుతుంది. అలాగే వాసెలిన్ అనేక ర‌కాలుగా ఉప‌యోగించ‌వ‌చ్చు. చాలా మందికి కనుబొమ్మలు పల్చగా ఉంటాయి. అలాంటి వారు రోజూ పడుకునే ముందు కనుబొమ్మలకి వాసెలిన్‌ రాసుకుని పడుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల కనుబొమ్మలు వత్తుగా పెరుగుతాయి. వాసెలిన్‌ జెల్లీ తో దంతాలను తుడవడం వల్ల దంతాలు మెరుస్తూ కాంతివంతంగా మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: