మెగాస్టార్ చిరంజీవి తాజాగా మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి నయనతార హీరోయిన్గా నటించగా ... టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరిలీయో సంగీతం అందించగా ... షైన్ స్క్రీన్ , గోల్డ్ బాక్స్ బ్యానర్లపై సాహు గారపాటి , సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందు అనగా జనవరి 11 వ తేదీన రాత్రి నుండి చాలా ప్రాంతాలను ప్రదర్శించారు. ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఓపెనింగ్స్ కూడా దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు నార్త్ అమెరికాలో కూడా అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో 3 మిలియన్ ప్లస్ దక్కినట్లు అధికారికంగా ప్రకటించారు. 

అలాగే ఇప్పటివరకు చిరంజీవి , అనిల్ రావిపూడి కెరియర్ లో కూడా నార్త్ అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాగా మరి శంకర వర ప్రసాద్ గారు మూవీ నిలిచినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా విజయ వంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఈ సినిమా కేవలం నార్త్ అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తూ ఫుల్ జోష్లో ముందుకు దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: