దానిమ్మ పండును ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ‘సూపర్ ఫుడ్’గా అభివర్ణించవచ్చు. ఎరుపు రంగులో మెరిసిపోయే ఈ గింజల్లో దాగి ఉన్న పోషక విలువలు శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతిరోజూ ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి దానిమ్మ ఒక గొప్ప రక్షణ కవచంలా పనిచేస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకోవడమే కాకుండా, రక్త ప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును (బిపి) అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ గ్రీన్ టీ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండి, శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.

వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో దానిమ్మ జ్యూస్ అగ్రస్థానంలో ఉంటుంది. ఇందులోని విటమిన్ సి, విటమిన్బాక్టీరియా మరియు వైరస్‌ల నుండి శరీరాన్ని రక్షించి, తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. జ్ఞాపకశక్తి పెరగాలని కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఔషధం. ప్రతిరోజూ ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడటమే కాకుండా, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. పేగుల్లో మంటను తగ్గించి, జీర్ణశక్తిని పెంచుతుంది. అయితే గింజలతో సహా తీసుకుంటే ఫైబర్ అధికంగా అందుతుంది.

చర్మ సౌందర్యం విషయంలో దానిమ్మ జ్యూస్ ఒక మ్యాజిక్ లా పనిచేస్తుంది. చర్మంపై ముడతలు పడకుండా నిరోధించి, ముఖం కాంతివంతంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అలాగే కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి కీళ్ల మధ్య మృదులాస్థి దెబ్బతినకుండా కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పురుషులలో మరియు స్త్రీలలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఈ జ్యూస్ తోడ్పడుతుంది. క్రీడాకారులు వ్యాయామానికి ముందు లేదా తర్వాత దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల కండరాల అలసట తగ్గి, తక్షణ శక్తి లభిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ ఎర్రటి దానిమ్మ జ్యూస్‌ను మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: