టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ తాజాగా నారి నారి నడుమ మురారి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సంయుక్త మీనన్ , సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించగా ... రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ప్రేక్షకుల నుండి వచ్చింది. ఈ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చిన కూడా ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని సినిమాల కంటే ఆలస్యంగా విడుదల కావడంతో ఈ మూవీ కి చాలా తక్కువ థియేటర్లు దొరికాయి. అలా తక్కువ థియేటర్లలో ఈ సినిమా విడుదల అయిన కూడా ఈ సినిమాకు అద్భుతమైన టాక్ రావడంతో ఈ మూవీ సూపర్ సాలిడ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మరియు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. ఇంకా ఎన్ని కలెక్షన్లను సాధిస్తే ఈ మూవీ హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.08 కోట్ల షేర్ ... 12.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 9.93 కోట్ల షేర్ ... 18.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా 10.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగింది. దానితో ఈ సినిమా మరో 32 లక్షల కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: