సాధార‌ణంగా ప్రతి ఒక్కరికి పరిపూర్ణ ముఖం ఉండాలని కోరిక ఉంటుంది. ఇలా క్ర‌మంలోనే అందమైన, మచ్చలు లేని ముఖం కావాలని అనుకుంటారు. అయితే దాన్ని సాధించటం చాలా కష్టమని చాలా మంది భావిస్తారు. కానీ, ఇంట్లో సులువుగా అందుబాటులో ఉండే వస్తువులతో చాలా సులభంగా అందమైన ముఖాన్ని మిల‌మిల మెరిపించ‌వ‌చ్చు. అందుకు ముందుగా నిమ్మకాయను అడ్డంగా కోసి, చర్మం నల్లబడిన చోట రుద్దాలి. అది కొంతసేపు బాగా అరినిచ్చి గోరువెచ్చ‌ని నీటిలో క‌డిగేయాలి.

 

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మ‌లినాలు పోయి.. చ‌ర్మం ప్ర‌కాశవంతంగా మెరుస్తుంది. బాదం పేస్ట్ మరియు బాగా పండిన బొప్పాయి గుజ్జు కలిపి మీ ముఖానికి పట్టించి హాయిగా విశ్రాంతిగా పడుకోండి. ఒక పావుగంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమ‌లు పోయి అందం.. ఆక‌ర్ష‌నీయంగా క‌నిపిస్తుంది. అలాగే కరివేపాకు పేస్ట్, శనగపిండి, పాలు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

 

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం క‌నిపిస్తుంది. మ‌రియు సెనగపిండిలో కొద్దిగా పాలు, ఒక టీస్పూను రోజ్‍‌వాటర్, చిటికెడు పసుపు కలిపాలి. ఈ పేస్టును చర్మానికి ఆప్లై చేసి బాగా ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం మృదువుగా అవ్వ‌డమే కాకుండా ప్ర‌కాశవంతంగా కూడా అవుతుంది. అదేవిధంగా.. చందనం, బాదం, తేనె మరియు పెరుగు అన్నింటిని కలిపి పేస్ట్ చేయండి. ఈ మిశ్ర‌మాన్ని ముఖం మరియు మెడ మీద అప్లై చేయాలి. బాగా ఆరిన త‌ర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

  

మరింత సమాచారం తెలుసుకోండి: