అందం విష‌యంలో అమ్మాయిలు అస్స‌ల వెన‌క్కి త‌గ్గ‌రు. అందుకే అందం విషయంలో జాగ్రత్తగా సంరక్షంచుకుంటారు. ముఖంతో పాటు పాదాలు, చేతుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. తరచూ పార్లర్‌లో పెడిక్యూర్‌, మానిక్యూర్‌ చేయించుకుంటారు. అయితే ఇంత చేసినా కొందరిలో మోచేతులు న‌లుపుగా ఉంటాయి.  ముఖం, మెడ, చేతులు నిమ్మపండు రంగులో ఉన్నా.. మోచేతులు మాత్రం నల్లగా ఉంటే.. తెగ ఇబ్బందిప‌డుతుంటారు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే అద్భుత‌మైన టిప్స్ పాటిస్తే.. మీ మోచేతులు న‌లుపుకు చెక్ పెట్ట‌వ‌చ్చు. అవేంటి అన్న‌ది ఓ లుక్కేసేయండి.

 

ముందుగా అరటీస్పూన్ బేకింగ్ సోడాకు ఒక స్పూన్‌ డిస్టిల్డ్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను మోచేతులకు అప్లై చేసి పావు గంట‌ తర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఈ ప్రత్యేకమైన రెమెడీని రోజుకు ఒకసారి అప్లై చేస్తే చాలు మంచి ఫలితం పొందొచ్చు. అలాగే  కొద్దిగా శనగపిండి తీసుకుని అందులో పెరుగు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీనిని ముందుగా మోచేతులకు అప్లై చేయాలి. కాస్తా ఆరాక నీటిని చల్లి స్క్రబ్‌లా చేస్తూ క్లీన్ చేయాలి. ఇలా రోజుకి రెండు, మూడు సార్లు చేస్తే మోచేతుల న‌లుపు త‌గ్గుతుంది.

 

అదేవిధంగా,  పావు కప్పు పాలల్లో ఒక స్పూన్‌ నిమ్మరసం, అర స్పూన్ పటికా కలిపి ఈ మిశ్రమాన్ని మోచేతులు ప్రాంతంలో బాగా రుద్దాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. నలుపుతో పాటు గరుకుదనం తగ్గుతుంది. ఇక ఆలివ్‌ ఆయిల్‌లో పంచదార కలిపి మోచేతులు మీద‌ సున్నితంగా స్క్రబ్‌ చేయాలి. తర్వాత సబ్బునీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తూ ఉంటే ఈ ప్రదేశాలు తెల్లగా తయారవుతాయి. అలోవేరాలో కూడా చక్కని గుణాలు ఉంటాయి. అందుకే దీనిని ఉపయోగించి మోచేతుల నలుపుదనాన్ని పోగొట్టుకోవచ్చు. ఇందుకు అలోవేరా జెల్‌ని మోచేతులపై అప్లై చేయాలి. ఆరిన త‌ర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: