ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలతో నిండిన సరైన పోషకాలను తీసుకోవడం బలమైన మరియు ఆరోగ్యకరమైన జుట్టుకు చాలా అవసరం. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మీ ఆహారంలో విటమిన్ ఎ, బి, సి, మెగ్నీషియం, ఐరన్, జింక్ మరియు కాల్షియం చేర్చడం మంచిది, పాలకూర, చిలకడ దుంపలు, క్యారెట్, పాలు మరియు పాల పదార్ధాలు, గ్రుడ్లు, ఓట్స్, వాల్ నట్స్, చేపలు వంటివి తినాలి. దీని వల్ల మీరు ఆరోగ్యంగా బలంగా ఉంటారు. దీంతో జుట్టు రాలటం తగ్గి మీ జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.
సరైన రక్షణ లేకుండా ఎండ, కాలుష్యం, వర్షపు నీరు మరియు ధూళి అధికంగా మీ జుట్టుపై పడటం వల్ల మీ జుట్టు పొడిగా, పెళుసుగా అవుతుంది. జుట్టును వీలైనంత వరకూ రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఎప్పుడైనా వర్షం లేదా ధూళి జుట్టుపై పడితే, అదే రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి.కండీషనర్ అప్లై చేయడం మర్చిపోవద్దు.
మీరు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టుకు మంచి పోషణను ఇచ్చే కండీషనర్‌ను అప్లయ్ చెయ్యండి. అలాగే, కండీషనర్ ను వాష్ చేసేటపుడు చల్లటి నీటిని ఉపయోగించటానికి ప్రయత్నించండి. ఇది రంధ్రాలను మూసివేయడానికి సహాయపడుతుంది మరియు తల మీద చర్మం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. కండీషనర్ వాడటం వల్ల మీ జుట్టు కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి