మొటిమల కారణంగా నల్ల మచ్చలు అలాగే రంధ్రాలు కూడా ఏర్పడుతుంటాయి.  ముఖం మీద గుంటలు గుంటలు గా రంధ్రాలు ఏర్పడి చూడడానికి అసహ్యకరంగా వుంటుంది. అయితే వీటి కోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల కాస్మెటిక్స్, ఫేస్ క్రీమ్, సర్జరీస్ అంటూ వేలకు వేలు ఖర్చు పెట్టినప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ కొంతమందిలో చర్మం బ్రేక్ అవుట్స్ అయ్యి, పొడిబారి  శీతాకాలం వచ్చేసరికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పొడి చర్మం ఉన్నవారు ఈ పోర్స్ వల్ల ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు.అయితే ఇలాంటి వారి కోసమే  కేవలం ఒకే ఒక ప్రోడక్ట్ మాత్రమే వాడి ఆ రంధ్రాలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.


అయితే ముందుగా ఇప్పుడు చెప్పబోయే చిట్కా మాత్రం కేవలం డ్రై స్కిన్ మరియు నార్మల్ స్కిన్ వారి కోసమే. ఇలాంటి వారు ముందుగా చేయాల్సింది స్లగ్గింగ్. అసలు స్లగ్గింగ్  అంటే ఏమిటి?  డైలీ టెన్ స్టెప్ స్కిన్ కేర్ రొటీన్ లా  కాకుండా స్లగ్గింగ్ లో ఒకటే ప్రాసెస్ ఉంటుంది.  స్కిన్ లోపల్నుంచి గ్లో  రావాలని కోరుకునే వాళ్లకి మంచి స్టెప్. ఈ ట్రెండ్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏమిటంటే స్కిన్ యొక్క బారియర్ ను ప్రొటెక్ట్ చేయడం,స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండేటట్లు చూడడం లాంటివి. ఫలితంగా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

ఇందుకోసం మీరు పెట్రోలియం జెల్లీ ను తీసుకోవాలి. ఇక మీరు చేయవలసిందల్లా రాత్రి పడుకునే ముందు ఈ పెట్రోలియం జెల్లీని ఫేస్ కి అప్లై చేసుకొని పడుకోవడమే. పెట్రోలియం జెల్లీ కి వున్న అక్లూజివ్ సహజత్వం వల్ల స్కిన్ పోర్స్  ని క్లాగ్ చేసి,  చర్మ సమస్యలను దూరం చేస్తుంది. ముందుగా డబుల్ క్లెన్సింగ్ తో మొదలు పెట్టండి.  మీకు తెలిసిన పద్ధతే.ఇది కొరియన్ స్కిన్ కేర్ లో అతి ముఖ్యమైన స్టెప్ అని.

డబుల్ క్లెన్సింగ్ అయిపోయిన తర్వాత మీ రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ టోనింగ్, మాయిశ్చరైజింగ్ ,సీరం వంటివి ఫాలో అయిపోండి.  ఆ తర్వాత ముఖానికి పెట్రోలియం జెల్లీని మందపాటి  లేయర్ గా అప్లై చేసి నిద్రపోండి. ఉదయాన్నే నిద్ర లేచాక స్కిన్ మీద మిగిలి ఉన్న పెట్రోలియం జెల్లీని ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకుని తుడిచి వేయాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ ను సాఫ్ట్ గా సఫుల్ గా  తయారు చేయడంతో పాటు ముఖం మీద ఉన్న రంధ్రాలను కూడా తొలగించి వేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: