మహిళల్లో ఎక్కువమంది పెళ్ళికి ముందు సన్నగా, నాజుగ్గా ఉంటారు. అదే పెళ్లయిన తర్వాత ఊహించని విధంగా వారు ఉన్నట్టుండి బరువు పెరుగుతారు. ఇలాంటి సమయంలో చర్మం సాగుతుంది.  ఆ తరువాత ఎన్నో ఎక్సర్సైజులు, వ్యాయామాలు,ఫుడ్ డైట్  లు చేస్తూ సన్నబడిపోతారు. ఉన్నట్టుండి అధికబరువు నుంచి సన్నగా అయినప్పుడు పొట్ట పైన చర్మం వదులు అవుతుంది. ఫలితంగా పొట్ట పైన,పిక్కల పైన చార లాంటివి ఏర్పడతాయి. వీటినే స్ట్రెచ్ మార్క్స్ అంటారు. అంతేకాకుండా పిల్లలు పుట్టాక కూడా మహిళల పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ శాశ్వతంగా పడిపోతాయి. ఇక ఎప్పుడైనా వెస్ట్రన్ వేర్ వేసుకోవాలని అనుకున్నప్పుడు లేదా చీర కట్టుకోవాలనుకున్నాపుడైనా ఈ చారలు కనబడితే, చూడడానికి అసహ్యంగా కనిపిస్తోందని భావించే మహిళలు ఎంతోమంది ఉన్నారు.

అయితే ఇలాంటి చారలను వదిలించుకోవాలంటే మాత్రం సరైన శస్త్రచికిత్స అవసరం అవుతుంది. కానీ కాస్మెటిక్ సర్జరీలు, ఖరీదైన, అత్యంత హానికరమైన రసాయనాల జోలికి మాత్రం వెళ్లకండి. అంతేకాదు మీకు తెలియని ఇంకొక విషయం కూడా ఉంది. ఈ మధ్య కాలంలో స్ట్రెచ్ మర్క్స్ ను దాచకుండా బహిరంగంగా కనిపించేలా కొంతమంది  సెలబ్రిటీలు సరికొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. కైలీ జెన్నర్, ఆశ్లే గ్రాహం,జమీలా జమిల్,రిహన్నా వంటి ఎంతో మంది సెలబ్రిటీలు " వియ్  ఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ స్ట్రెచ్ మార్క్స్" అంటూ  ఫోటోలనూ, వీడియోలనూ  సోషల్ మీడియాలో పదేపదే పోస్ట్ చేస్తూ ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఎంతో మంది చారలతో బాధపడుతున్నవారిలో సరికొత్త ఉత్తేజం నింపడానికి వారు ఇలా చేస్తున్నారన్న విషయం అందరికి తెలిసిందే.

అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని  చిట్కాలు పాటించి, వాటిని ఎలా పోగొట్టుకోవాలో  చూద్దాం

కలబంద:
కాంతివంతమైన చర్మం కోసం సరికొత్త స్కిన్ టిష్యూలను డెవలప్ అయ్యేలా చేసి, పొట్టపై చారలను దూరం చేస్తుంది. చారలను  ఉన్న చోట కలబంద గుజ్జుని రాసి, అరగంట తర్వాత మంచి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చారలు తగ్గుముఖం పడతాయి.

కీరా - నిమ్మ:
కీర దోసకాయ గుజ్జును నిమ్మరసంతో కలిపి స్ట్రెచ్ మార్క్స్ ఉన్నచోట ఈ ప్యాక్ వేసుకుంటే తగ్గుముఖం పడతాయి.

కోకోవా బటర్:
రాత్రిపూట పడుకునే ముందు కోకో బటర్ ను స్ట్రెచ్ మార్క్స్ ఉన్నచోట రాసి, మసాజ్ చేసుకుంటే కొంత కాలం తర్వాత స్ట్రెచ్ మార్క్స్ అన్నీ తొలగిపోతాయి.

ఆముదం నూనె :
మంచి ఫలితాల కోసం గానుగలో తీసిన స్వచ్ఛమైన ఆముదం నూనె ను తీసుకొని, స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాయండి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: