గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో పెద్దగా చెప్పనవసరం లేదు. కానీ గ్రీన్ టీ కేవలం ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనల ద్వారా తేలింది. గ్రీన్ టీ వల్ల ముడతలు, గీతలు,పిగ్మెంటేషన్,మెలనోమా తోపాటు నాన్ మెలనోమా క్యాన్సర్ వంటి అతినీలలోహిత కిరణాల వల్ల కలిగే చర్మ సమస్యలను నివారించడంలో గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ ఉపయోగించడం వల్ల ఏవిధంగా ముడతలు తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పసుపు - గ్రీన్ టీ :
చర్మం మీద అధికంగా ఏర్పడే సెబమ్ ను తగ్గించడానికి గ్రీన్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే చర్మం మీద మొటిమలకు పసుపు చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి, ఒక అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ అన్ని ఒక బౌల్లో బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, సుమారు 10 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.  ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చర్మ సమస్యలను నయం చేసుకోవచ్చు.

ఆరెంజ్ తొక్క - గ్రీన్ టీ :
ఆరెంజ్ తొక్క యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మంలో కొల్లాజిన్ ఉత్పత్తులను పెంచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ, ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ తొక్క పొడి ని, అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.

బియ్యం పిండి -  గ్రీన్ టీ :
జిడ్డు చర్మం వున్నవారికి ఈ ఫేస్ ప్యాక్ చక్కగా పని చేస్తుంది. ఇందుకోసం బియ్యం పిండిని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ టీ, కొద్దిగా తేనె  కలిపి బాగా మిశ్రమంగా చేయాలి.  ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.

పైన చెప్పిన పద్దతులను పాటించి, ముఖం పైన ముడతలు రాకుండా నిత్యయవ్వనంగా  కనిపించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: