అందం అమ్మాయి ప్రతిబింబం. అందం అంటే కేవలం ముఖం మాత్రమే అందంగా ఉంటే సరిపోదు, ముఖంలో ఉండే అన్ని భాగాలు కూడా అందంగా కనిపించాలి. ప్రస్తుత కాలంలో చాలా మంది పెదాలు నల్లబడుతున్నాయని వాపోతున్నారు. అయితే పెదాలు నల్లగా అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, సూర్యరశ్మి కి అధికంగా గురికావడం, వాయు కాలుష్యం, మరికొంత మందికి స్మోకింగ్ చేసే అలవాటు ఉండడం,  ఇలాంటి కారణాల  వల్ల కూడా పెదవులు నల్లగా మారే అవకాశం ఉంది.. అయితే వీటికి ఎలాంటి కాస్మెటిక్స్ వాడకుండానే, సహజ పద్ధతిలో ఎలా సహజ రంగులోకి తీసుకురావాలో..? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

వాల్ నట్స్ :
వాల్ నట్స్ లో ఒమేగా త్రీ  కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్నాయి. ఇవి పెదవుల చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సహాయపడతాయి. పెదవులపై వాల్నట్స్ తో స్క్రబ్ చేస్తే, చనిపోయిన చర్మ కణాలను తొలగించి, చర్మం యొక్క స్థితిస్థాపకత ను  కూడా మెరుగుపరుస్తుంది.

పెరుగు:
కుంకుమపువ్వు ను కలిపిన పెరుగును పెదాలపై రాయడం వల్ల పెదాలు సహజ రంగు కు చేరుకుంటాయి.

కొబ్బరి నూనె :
పొడిబారిన, పగిలిన పెదవులపై కొబ్బరి నూనె రాయడం వల్ల చర్మానికి తగినంత తేమ అంది పెదాలు హైడ్రేట్ గా ఉంటాయి.

టొమాటోలు :
టొమాటోలకు  శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఎండ వల్ల పెదవులు కమిలినట్టు అనిపిస్తే, పెదాలపై టొమాటో గుజ్జు రాయడం వల్ల  మంచి ఫలితం ఉంటుంది.

 గ్రీన్ టీ :
కాఫీకి పెదవులు నల్లగా ముదురు రంగులోకి మార్చే గుణం ఉంటుంది. కాబట్టి కాఫీ కి బదులు గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి కూడా మంచిది.

 తేనె :
పెదాలకు తేనె పూసి కాసేపు అయిన తర్వాత నీటితో కడిగేయాలి. తేనెలో ఉండే ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్  లు పెదవుల రంగు మారకుండా కాపాడుతాయి.కాబట్టి వీలైనంత వరకు ఈ పద్ధతులను పాటించి,మీ నల్లని పెదాలను సహజ రంగు కు వచ్చేలాగా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: