ప్రతి ఒక్కరికి జుట్టు పొడవుగా, అందంగా, సిల్కీగా, షైనీ గా ఉండడంతోపాటు బౌన్సీ గా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవన్నీ తాత్కాలికంగా మాత్రమే ఫలితాలను ఇస్తున్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో వీటివల్ల జుట్టు రాలే సమస్య కూడా మొదలవుతుంది. అంతేకాకుండా జుట్టు గడ్డిలాగ మారడాన్ని గమనించవచ్చు. అయితే వీటన్నింటికీ పరిష్కారం ఏమిటంటే.. మందారంతో సాధ్యం అంటున్నారు నిపుణులు.. అయితే మందార పువ్వు మన జుట్టును సిల్కీగా, బౌన్సీ గా ఎలా తయారు చేస్తుందో..?ఇప్పుడు తెలుసుకుందాం..



ప్రకృతి ఇచ్చిన ఎన్నో అందమైన మొక్కలలో మందార మొక్క కూడా ఒకటి . మందారం మొక్క చూడడానికి అందంగా కనిపించడమే కాకుండా ఈ మొక్కలోని ప్రతి భాగం మనకు ఉపయోగపడుతుంది. మందారం పువ్వు లో సహజంగా లభించే అమైనో ఆమ్లాలతో పాటు జుట్టు కుదుళ్లకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ముఖ్యంగా తల వెంట్రుకలలో కీలకమైన పదార్థం కెరోటిన్. సెబమ్ తలలో ఎక్కువగా పేరుకుపోయి,  జుట్టు సగానికి విరిగి పోతుంది. ఫలితంగా జుట్టు మధ్యలో విరిగిపోవడం, చిట్లి పోవడం లాంటివి జరుగుతుంటాయి.


మందారం లో ఉండే విటమిన్ సి, ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల తలలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే సెబమ్ ను నివారిస్తుంది. మందారం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రును నివారిస్తుంది. తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా జుట్టు రాలే సమస్య నుంచి తప్పించుకోవచ్చు. మందారం లో వుండే విటమిన్స్, మినరల్స్ తోపాటు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా వున్నాయి. ఇవన్నీ జుట్టు ఒత్తుగా, మెత్తగా, బౌన్సీ లా అయ్యేలా చేస్తాయి.


ఇందుకోసం కొన్ని మందారం పువ్వులను, అంతే మోతాదులో మందారం ఆకులను తీసుకొని, కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో కొబ్బరి నూనెను వేడి చేసి, అందులో ఈ మందారం పేస్ట్ను కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా వేడి చేసి, చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫిల్టర్ సహాయంతో వడగట్టుకుని  ఒక గాజు పాత్రలో మాత్రమే నిల్వ చేసుకోవాలి.


అయితే వారానికి ఒకసారి రాత్రి పడుకునే ముందు ఈ నూనెను గోరువెచ్చగా చేసుకుని, తలకు పట్టించి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు బాగా సిల్కీ గా, షైనింగ్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: