అమ్మాయిలు అందానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇది జగమెరిగిన సత్యం. రంగు, జుట్టు, బరువు, గోర్లు ఇలా అన్నింటిపై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. గోర్లు అనేవి పొడవుగా ఉంటేనే ఆకర్షణీయంగా ఉంటాయి. అప్పుడే నెయిల్ పాలిష్ పెట్టిన గోళ్లు అందంగా కనిపిస్తాయి. అయితే చాలా మందికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా గోళ్ళు సరిగా పెరగవు. అలాంటి వారు ఈ చిన్న టిప్స్ ని ఫాలో అయినట్లైతే గోళ్లు త్వరగా అందంగా పెరుగుతాయి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* తెల్లటి పేస్టును తీసుకొని మీ గోళ్లపై అప్లై చేసి... టూత్ బ్రష్ తో మెల్లగా రబ్ చేయండి.. ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు అన్ని గోళ్లకు చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ గోళ్లలో దాగి ఉన్నటువంటి మలినాలు పోయి ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతే కాకుండా షైనింగ్ కూడా బాగా వస్తుంది.

* ఆ తర్వాత వాజిలిన్ ప్రతి గోరుకు రాసి 45 నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీళ్లతో శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వలన గోళ్లు గట్టిపడతాయి మరియు అంత ఈజీగా విరగవు.

* సగం నిమ్మ చెక్కను తీసుకుని, ఆ రసాన్ని గోర్లపై పిండుతూ ఒక రెండు నిమిషాలు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో గోళ్లను శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వలన గోళ్లలో షైనింగ్ పెరుగుతుంది. ఇలా  ఒకదాని తరవాత ఒకటి చేస్తూ ఉంటే గోళ్ళు అందంగా పొడవుగా పెరుగుతాయి. కేవలం ఒక వారం లోనే మీ గోళ్ళ పెరుగుదలలో మార్పును మీరే చూస్తారు. పొరపాటున కూడా కెమికల్స్ లాంటివి మీ గోళ్లు పెరగడానికి వాడకండి.

వీటిని రెగ్యులర్ గా పాటించండి... పొడవైన ఆకర్షణీయమైన గోళ్లను మీ సొంతం చేసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: