ఈ రోజుల్లో చాలా మందికి కూడా చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది. ఈ సమస్య రాగానే మనలో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ తెగ వాడేస్తూ ఉంటారు.అయితే అలా కాకుండా మన ఇంటిలోనే దొరికే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో చాలా సులభంగా తెల్ల జుట్టును ఈజీగా నల్లగా మార్చుకోవచ్చు.ఇంకా అలాగే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా తెల్ల జుట్టుని ఈజీగా నల్లగా మార్చుకోవచ్చు. ఇక ఉసిరికాయ తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఎందుకంటే ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలాగే శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.ఇంకా అలాగే మెలనిన్ స్థాయిలను పెంచి తెల్ల జుట్టు నల్లగా మారటానికి బాగా సహాయపడుతుంది.ఒక నాలుగు ఉసిరికాయలను తీసుకొని వాటిని సన్నగా తరిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.తరువాత గ్యాస్ స్టవ్ మీద రెండు లేదా మూడు స్పూన్ల కొబ్బరి నూనె వేడి చేసి నూనె కాస్త వేడయ్యాక ఉసిరిముక్కలు వేసి వాటిని బాగా మరిగించాలి.


ఉసిరి మొక్కలు నల్లగా మారేవరకు మరిగించాలి.తరువాత చల్లారిన నూనెను జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల దాకా బాగా పట్టించి గంట అలా వదిలేయాలి.ఆ తర్వాత కుంకుడుకాయతో శుభ్రంగా తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ఖచ్చితంగా తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.అలాగే కరివేపాకు కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి బాగా సహాయపడుతుంది.ఎందుకంటే కరివేపాకులో మెలనిన్ అనే సహజ వర్ణ ద్రవ్యం ఉండటం వలన తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా జుట్టు మూలాలను కూడా బాగా బలపరుస్తుంది.తరువాత ఒక పాన్లో నాలుగు స్పూన్ల కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. ఆ నూనె కాస్త వేడి అయ్యాక కరివేపాకు వేసి మరిగించాలి. కరివేపాకు నల్లగా మారే దాకా నూనెను మరిగించి ఆ నూనెను వడకట్టి చల్లార్చాలి. ఈ చల్లారిన ఈ నూనెను జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి బాగా మసాజ్ చేయాలి. తరువాత ఒక గంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చెయ్యాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, తెల్ల జుట్టు సమస్య ఈజీగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: