ఎప్పుడైనా తలకు నూనెను అప్లై చేసేముందు ఖచ్చితంగా గోరువెచ్చని నూనె మాత్రమే ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీ జుట్టుకు అద్భుతాలు చేస్తుంది. మన జుట్టును తేమగా, హెల్తీగా మారుస్తుంది. చిట్లిపోయిన జుట్టును చికిత్స చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.అవోకాడో, కొబ్బరి, ఆలివ్‌ ఇంకా బాదం ఈ నూనెలలో ఏదైనా దాన్ని.. వేడి చేసి మీ తలకు అప్లై చేసి మసాజ్‌ చేయండి.ఒక గంట ఆగిన తర్వాత తలస్నానం చేయండి.అలా చేస్తే జుట్టు కుదుళ్లు చాలా బలంగా అవుతాయి.ఆలివ్ ఆయిల్ చర్మం, జుట్టుకు మంచిది. మీకు పొడవాటి, గిరజాల జుట్టు కావాలంటే.. ఈ నూనెను ఉపయోగించండి. ఇది జుట్టు నిర్వహణను చాలా సులభతరం చేస్తుంది. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు పోషణను అందిస్తాయి.నువ్వుల నూనె జుట్టుకు చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో విటమిన్లు సమృద్ధిగా ఉండటమే కాకుండా, ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది పొడిబారిన, నిర్జీవమైన జుట్టుకు జీవం పోస్తుంది. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను రాసుకోండి.


 క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే.. మీ జుట్టు త్వరలోనే నల్లగా మారటం జరుగుతుంది.చాలా మంది కూడా జుట్టుకు ఆవాల నూనెను ఉపయోగిస్తారు. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది తలకు సంబంధించిన అన్ని రకాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. చిన్నవయసులోనే మీ జుట్టు నెరిసిపోతుంటే ఆవనూనె మాత్రమే రాయండి.బయట ఉండే దుమ్ము, కాలుష్యం జుట్టు రాలడానికి కారణమవుతుంది. అలాగే, కొంతమంది ఎండ వేడి తట్టుకోలేక ప్రతి రోజూ తలస్నానం చేస్తూ ఉంటారు. దీనివల్ల జుట్టులోని తేమ, నూనెలు తొలగిపోతాయి. ఎక్కువసార్లు తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు పాడయ్యే అవకాశం ఉంది. దీని వల్ల జుట్టు గడ్డిలా మారుతుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. అందుకే వేసవి కాలంలో తలస్నానం, జుట్టుకు నూనె రాయడంపై ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి పెట్టండి. కానీ, కొబ్బరి నూనెకు బదులుగా, కొన్ని ప్రత్యేక నూనెలతో మీ జుట్టును బలోపేతం చేయండి. వేసవిలో ఈ నూనెలు మీ జుట్టుకు బలం, మెరుపు, మృదుత్వాన్ని ఇస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: