మాస్ మహారాజా రవితేజ తప్పక హిట్ కొట్టాల్సిన సమయంలో క్రాక్ అనే సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే..శృతిహాసన్ కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమా కి గోపీచంద్ మలినేని దర్శకుడు కాగా ఈ సినిమా కి నిన్న గుమ్మడికాయ కొట్టేశారు..ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో ఈ పోస్టర్ ను విడుదల చేసి షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశాం అంటూ యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.  లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభించుకుని పూర్తిచేసుకున్న ఈ సినిమా కి ముందు రవితేజ సినిమాలు దాదాపు ఆరు  ఫ్లాప్ అయ్యాయి.. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని తనకు అచ్చిచ్చిన డైరెక్టర్ తో చేతులు కలిపాడు..